నోట్ల రాజ్యాన్ని పారదోలుదాం - ఓట్ల రాజ్యాన్ని సాధిద్దాం

నందికొట్కూరు బీఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జి స్వాములు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా మండల కేంద్రంలో నందికొట్కూరు బిఎస్పీ పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ స్వాములు ఆధ్వర్యంలో నూతన గ్రామకమిటీని ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా స్వాములు మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన ఎన్నికలు అందుకు విరుద్ధంగా అగ్రకులమనువాద పార్టీల నాయకులు అక్రమంగా సంపాదించిన నోట్లతో పేద ప్రజల ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చి రాజ్యాంగాన్ని తుంగలో తోక్కుతున్నారని,డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందపరిచిన ఆదేశిక సూత్రాలకు వ్యతిరేకంగా పరిపాలిస్తూ సామాజికంగా,ఆర్థికంగా బహుజనులను మరింత వెనుకబాటుకు గురి చేస్తున్నారని,అగ్రకుల నాయకులు దేవాలయాలాంటి చట్టసభల్లో కేవలం వారి కులాలు మాత్రమే లబ్ధి పొందే విధంగా పరిపాలన సాగిస్తున్నారని, అగ్రకులమనువాద పార్టీలకు ఓట్లు వేసి గెలిపిస్తూ మన జీవితాలను మనమే నాశనం చేసుకుంటున్నామని, మహాత్మా పూలే ప్రారంభించిన పోరాట స్ఫూర్తిగా అంబేద్కర్ ఆలోచన విధానంతో కాన్సిరాం నడిచిన మార్గంలో నడిచి బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేసి రాజ్యాధికారం సాధించుకుందామని తెలిపారు.అనంతరం జూపాడుబంగ్లా మండల కేంద్రంలోని నీలి పల్లి పేటలో  బీఎస్పీ గ్రామ కన్వీనర్ గా చిన్న,గ్రామ అధ్యక్షులుగా లోకేష్, గ్రామఉపాధ్యక్షులుగా ప్రశాంత్,రవి,ప్రధాన కార్యదర్శిగా ప్రభాకర్,కార్యదర్శి విజయకాంత్,ట్రెజరీ సైమాన్,కార్యవర్గ సభ్యులుగా అజయ్, అరవింద్,జాన్,ప్రమోద్, శివరాం లను ఎన్నుకున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: