రంగరంగ వైభవంగా ప్రారంభమైన.... 

తర్తూరు శ్రీ లక్ష్మి పాండు రంగస్వామి తిరుణాల

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల  జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు మండలంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే తర్తూ రు గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మి పాండురంగ స్వామి తిరుణాల మహోత్సవం రంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నందికొట్కూరు శాసనసభ సభ్యులు ఆర్థర్ పాల్గొని శ్రీ లక్ష్మి పాండురంగ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని వివిధ ప్రాంతాల నుండి అశేష సంఖ్యలో వచ్చిన భక్తాదులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సాయంకాలం జరిగిన శ్రీ లక్ష్మి పాండురంగ స్వామి వారి రథోత్సవ మహోత్సవానికి వివిధ ప్రాంతాల నుండి అశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు. నేటితో ప్రారంభమైన తర్తూరు తిరుణాల మహోత్సవం వారం రోజులపాటు జరుగుతుందని, తిరుణాలలో పిల్లలకు ఆహ్లాదకరమైన ఆనందాన్ని ఇచ్చే ఉయ్యాలలు,బ్రేక్ డాన్సు ఉయ్యాలలు, సర్కస్,రైతులకు సంబంధించిన వ్యవసాయ సామాగ్రి మరియు ప్రజల నిత్యవసరలకు ఉపయోగపడే వంట సామాగ్రితో పాటు ప్రజల అవసరాలకు ఉపయోగపడే దొరకని వస్తుసామాగ్రి ఉండదని తిరుణాలకు విచ్చేసిన భక్తులు ఆనందంగా తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: