విద్యార్ధులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి

పిడిఎస్ యూ డివిజన్ కార్యదర్శి మర్రి స్వామి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాలజిల్లా నందికొట్కూరు పట్టణంలోని జడ్.పి.హెచ్.ఎస్ కోట పరీక్ష కేంద్రం నందు 10వ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు పబ్లిక్ పరీక్ష కేంద్రంలో కనీస మౌలిక వసతులు శూన్యంమని, స్థానిక సంబంధిత అధికారులు కనీసం పరీక్ష రాసే సమయంలో విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు అయిన లైట్లు,ఫ్యాన్లు మరియు కరెంటు సదుపాయం కూడా ఏర్పాటు చేయలేదని,ముందస్తు జాగ్రత్తగా హాల్ టికెట్లకు సంబంధించిన నోటీసు బోర్డు కూడా సంబంధిత అధికారులు ఏర్పాటు చేయలేదని పిడీఎస్ యూ డివిజన్ కార్యదర్శి మర్రిస్వామి ఆవేదన వ్యక్తం చేశారు.


పబ్లిక్ పరీక్ష రాసే పదవతరగతి  విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని లేని పక్షాన పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను సమీకరించి పిడీఏస్యు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్యు డివిజన్ సహాయ కార్యదర్శి శ్రీరామ్,అరవింద్ పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: