ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారి...
స్థలాల క్రమబద్ధీకరణకు సువర్ణ అవకాశం
చార్మినార్ మండల తాసిల్దార్ ఎస్ పి ఆర్ మల్లేష్ కుమార్ వెల్లడి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారి స్థలాలను క్రమబద్దీకరించే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని చార్మినార్ మండల తాసిల్దార్ ఎస్ పి ఆర్ మల్లేష్ కుమార్ తెలిపారు. మరోసారి జి ఓ 58*59 ద్వారా ప్రభుత్వ స్థలాలలో ఇల్లు కట్టుకొని ఉన్నవారికి క్రమబద్దీకరణ దార్ఖస్తుల స్వీకరణ చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. ఏప్రిల్ 1 నుండి 30 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబడిందని ఆయన వెల్లడించారు. 2020 జూన్ రెండవ తేదీ లోపు లోపు ఉన్న సంబంధిత ఆధారాలతో స్థలాలను క్రమబద్దీకరణ చేసుకోవచ్చు అని ఆయన తెలిపారు. ఈ దరఖాస్తులను మీ దగ్గరలోని మీసేవ కేంద్రాలలో చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ పేర్కొంటున్న 8801119950 లేదా 9701013463 లకు ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని ఆయన వెల్లడించారు. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కొరకు కావలసిన డాక్యుమెంట్లు ఇలా జతపరచాలని ఆయన తెలిపారు.
జతపరచవలసిన డాక్యుమెంట్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి
*అప్లికేషన్ దారుని యొక్క పాస్ పోర్ట్ సైజ్ ఫోటో*
👉🏻 *మి ఇంటి యొక్క కలర్ ఫోటో*
👉🏻 *మి ఇంటి డాక్యుమెంట్స్(నోటరీ జూన్ 2020 కి ముందు*
👉🏻 *ఆధార్ కార్డు*
👉🏻 *ప్రాపర్టీ టాక్స్* *జూన్ 2020 కి ముందు*
👉🏻 *కరెంట్ బిల్ జూన్ 2020 కి ముందు* లేదా
👉🏻 *వాటర్ బిల్లు జూన్ 2020 కి ముందు*
*ఇవి తీస్కొని మి సేవ వద్దకు వెళ్తే క్రమబద్దీకరణ చేసుకోవచ్చు*
Home
Unlabelled
ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారి... స్థలాల క్రమబద్ధీకరణకు సువర్ణ అవకాశం ,,,, చార్మినార్ మండల తాసిల్దార్ ఎస్ పి ఆర్ మల్లేష్ కుమార్ వెల్లడి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: