కంటి వెలుగులో చికిత్స చేయించి మరీ...
చేసిన అభివృద్ధి నీకు చూపిస్తాం
అందెల శ్రీరాములుపై భగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు
ప్రశాంత జల్పల్లిలో మత చిచ్చుపెట్టోద్దు
జల్పల్లి మున్సిపల్ అభివృద్ధిపై చర్చకు సిద్దమా అందెల
ఇష్టమొచ్చినట్లు అవాక్కులు...చెవాక్కులు పేల్చితే చూస్తూ ఊరుకోం
అందెలా శ్రీరాములకు బీఆర్ఎస్ నేతల హెచ్చరిక
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
అందెల శ్రీరాములు చేసిన వ్యాఖ్య లపై భగ్గుమన్న జల్పల్లి మున్సిపల్ బిఆర్ఎస్ శ్రేణులు, కౌన్సిలర్ల తీవ్రంగా మండిపడ్డారు. అందెల శ్రీరాములు అవినీతి బాగోతానికి ఆధారాలు సైతం తమవద్ద ఉన్నాయని వారు పేర్కొన్నారు. గురువారంనాడు జల్పల్లి మాజీ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షులు ప్రస్తుత జల్పల్లి మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు కైసర్ బాం, జల్పల్లి మున్సిపాలిటీ రిప్రెజెంటేటివ్ వైస్ చైర్మన్ సయ్యద్ యూసఫ్ పటేల్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జల్పల్లి మాజీ సర్పంచ్, రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షులు, ప్రస్తుత కోఆప్షన్ సభ్యులు సూరెడ్డి క్రిష్ణారెడ్డి, జల్పల్లి మున్సిపల్ రిప్రెజెంటేటివ్ వైస్ చైర్మన్ సయ్యద్ యూసఫ్ పటేల్ మాట్లాడుతూ:...నిన్న అందెల శ్రీరాములు యాదవ్ చేసిన ఆరోపణ ఖండించారు. జల్పల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి జరగలేదని అందెల శ్రీరాములు అన్నారని, తాము చేసిన మున్సిపాలిటీ అభివృద్ధి గురించి వివరాలతో వెల్లడిస్తున్నామని వారు పేర్కొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధి గురించి వారు లెక్కలతో కూడిన వివరాలను వెల్లడించారు. అందెల శ్రీరాములు యాదవ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, సోయ లేకుండా విమర్శ చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు. మున్సిపాలిటీ జరిగిన అభివృద్ధి మీ కంటికి కనిపించకపోతే రండి కెసిఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో మీ కళ్ళను చూపించి ఉచితంగా అద్దాలు ఇప్పించి మరీ చేసిన అభివృద్ధిని చూపిస్తామని ఇందుకు అందెల శ్రీరాములు సిద్దమా అని వారు సవాల్ విసిరారు.
జల్పల్లి మాజీ ఉప సర్పంచ్ షేక్ జహంగీర్ మాట్లాడుతూ,,,అభివృద్ధి అంటే సబితమ్మ ...సబితమ్మ అంటే అభివృద్ధి అని,... శ్రీరాములు యాదవ్ రాజకీయం కోసం మాట్లాడుతున్నాడని, ఆయన మాటలు ప్రజలు నమ్మరని... అలాగే స్థానిక 16వ కౌన్సిలర్ గెలిచింది ఏ పార్టీలో, పోయింది ఏ పార్టీలోకి, ఉంటుంది ఏ పార్టీలో,.. ఇదంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ పార్టీ మునిగిపోయే నావఅని ప్రజలకు అర్థమైందని బిఆర్ఎస్ ప్రవాహంలో కొట్టుకుపోవటం ఖాయమని తెలిపారు..
జల్పల్లి మున్సిపల్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యంజాల జనార్ధన్ మాట్లాడుతూ,,,దేవుడి పేరు పెట్టుకున్న మీరు అందెల శ్రీరాములు యాదవ్ , ప్రశాంతంగా ఉన్న జల్పల్లి మున్సిపాలిటీలో మతాల మధ్య చిచ్చు పెట్టవద్దని కోరారు. అలాగే అందెల శ్రీరాములు యాదవ్ చిల్లర రాజకీయాలు చేయవద్దు హుందాగా ఉండాలి, అసత్య ఆరోపణలు మానుకోవాలని హితువు పలికారు. మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి మోడీ ఫోటో లేదని అడిగారో, మీ యొక్క కేంద్ర విశ్వవిద్యాలయాలు, పాఠశాలలలో, నవోదయ పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో విద్యాశాఖ మంత్రి ఫోటో ఉన్నదా అని ఆయన నిలదీశారు. మీ లెఫ్ట్ రైట్ రెండు సంక పిల్లల మాటల విని జల్పల్లి మున్సిపాలిటీకి వచ్చి అభివృద్ధి జరగలేదు, మోడీ ఫోటో లేదు డ్రైనేజీ లేదు, కార్యచరణ అని అవాకులు చవాకలు పేలితే ఇక్కడ చూస్తూ ఊరుకునేటటుకి ఎవరూ లేరు.. కాబట్టి రాజకీయమనేది హుందాగా చేయండి స్వలాభం కోసం చేయవద్దు..మీకు మైనారిటీల మీద అంత ప్రేమ ఉంటే 17వ వార్డు కౌన్సిలర్ వారి ఇంటి ముందు రోడ్డు, డ్రైనేజీ వేయించుకున్నారు,. ఆ వార్డ్ లో మెజారిటీ ఓటర్లు ఉన్న మైనార్టీ బస్తీలో ఎందుకు అభివృద్ధి చేయలేదు, దీనికి సమాధానం చెప్పండి అని అన్నారు.
16 వార్డు కౌన్సిలర్ అవినీతిమయంతో అక్రమాలతో మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతున్నాడు.. ప్రజల దగ్గర బలవంతపు వసూలు చేస్తూ పబ్బం గడుపుతున్నాడు.. గతంలో తాళ్లకుంట విషయంలో అనేక అసత్య ఆరోపణలు చేసిన 16వ కౌన్సిలర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఎందుకంటే 50 లక్షల రూపాయలు ముట్టినవి కనుక.. ఆ సమయంలో అందేల శ్రీరాములు యాదవ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్లిన ఫోటో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు ,..అలాగే అందులో శ్రీరాములు యాదవ్ గారికి ఎంత కమిషన్ ముట్టిందో వివరంగా తెలపాలని డిమాండ్ చేశారు. అభివృద్ధికి మారుపేరు జల్పల్లి మీరు చూడలేకపోతే మీ కంటికి కనిపించకపోతే, కంటి వెలుగు కార్యక్రమంలో మీ కళ్ళు చూపించి కళ్ళద్దాలు ఇప్పించి అభివృద్ధి చూపిస్తాం రండి అని సవాలు విసిరారు.రాబోవు రోజులో ఇలాంటి అసత్య ఆరోపణలు మతాల మధ్య చిచ్చు రేపే విధంగా చేస్తే ప్రజలు చెప్పులతో కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని అన్నారు.
అందెల శ్రీరాములు యాదవ్ చౌకోబార్ విమర్శలు మానుకొని హుందాగా రాజకీయం చేయాలని , మంత్రివర్యులు ను విమర్శిస్తే సహించేది లేదని మంత్రివర్యుల కాలి గోటు కూడా మీరు సరిపోరని అన్నారు. అమావాస్య పున్నం కు చుట్టం చూపుగా వచ్చి ఆరోపణలు చేస్తే సహించేది లేదు ఖబడ్దార్ అందెల శ్రీరాములు యాదవ్ అని హెచ్చరించారు.
19వ వార్డ్ కౌన్సిలర్ పల్లపు శంకర్ మాట్లాడుతూ,,,అందెల శ్రీరాములు యాదవ్ గతంలో మీరు మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.. అప్పుడున్న మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి ఇప్పుడున్న మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి మీ కంటికి కనిపించట్లేదా.. విచ్చేయండి నేను దగ్గరుండి ఏమేమి అభివృద్ధి జరిగిందో చూపిస్తా.. చౌకోబార్ విమర్శలు మానుకో మన ప్రియతమ మంత్రి సబితఇంద్రా రెడ్డి మంజూరు చేసిన నిధులతో నా 19వ వార్డులో రెండు కోట్ల నిధులు తో అభివృద్ధి జరిగింది. మంత్రివర్యులు విమర్శిస్తే సహించేది లేదు, మత రాజకీయాలకు జల్పల్లిలో తావు లేదు, ఖబడ్దార్ అందెల శ్రీరామ్ యాదవ్ అని హెచ్చరించారు.
జల్పల్లి మున్సిపాలిటీ బీసీ సెల్ అధ్యక్షులు ఉస్కెమూరి నిరంజన్ నేత, మైనార్టీ అధ్యక్షులు షేక్ అప్జల్ మాట్లాడుతూ,,,జల్పల్లి అభివృద్ధి అయితేనేమి మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధి అయితేనేమి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఆహార్నిశలు కృషిచేసి ఎన్నో నిధులు తెచ్చి అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. అలాగే ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు ,అసత్య ఆరోపణ మాలుకోవాలని హితువు పలికారు. రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను పత్రికా ముఖంగా క్షుణ్ణంగా నాయకులు వివరించడం జరిగినది. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసి.. బిజెపి నాయకులకు కనువిప్పు కలగాలని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సమావేశంలో 18 వ వార్డు కౌన్సిలర్ కెంచే లక్ష్మీనారాయణ, యువ నాయకులు డైనమిక్ లీడర్ యంజాల అర్జున్, మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు చెన్నం రాజేష్, సీనియర్ నాయకులు సూరెడ్డి జంగారెడ్డి, కొంగర సుభాష్, ఎం.డీ.సాదిక్, పి. నాగేష్ ముదిరాజ్, సూరెడ్డి వినయ్ రెడ్డి, ఏ.మారుతి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు
Home
Unlabelled
కంటి వెలుగులో చికిత్స చేయించి మరీ... చేసిన అభివృద్ధి నీకు చూపిస్తాం,,, అందెల శ్రీరాములుపై భగ్గుమన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ,,,,, ప్రశాంత జల్పల్లిలో మత చిచ్చుపెట్టోద్దు ,,, జల్పల్లి మున్సిపల్ అభివృద్ధిపై చర్చకు సిద్దమా,,, అందెల ఇష్టమొచ్చినట్లు అవాక్కులు...చెవాక్కులు పేల్చితే చూస్తూ ఊరుకోం,,, అందెలా శ్రీరాములకు బీఆర్ఎస్ నేతల హెచ్చరిక
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: