అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతికి.... 

కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి

విద్యార్థి, ప్రజా సంఘాల డిమాండ్

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడు బంగ్లా మండల కేంద్రంలోవున్న అంబేద్కర్ గురుకుల పాఠశాలలో దీన్నేదేవరపాడు గ్రామానికి చెందిన 9 వ తరగతి చదువుతున్న నాగేశ్ అనే విద్యార్థి ఈతకు వెళ్లి మృతి చెందాడని,ఆదివారం పాఠశాలలకు సెలవు కావడంతో అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులు హాస్టల్లో నుండి బయటికి వెళ్లకుండా చూసుకోవలసిన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్,పిడి, హౌస్ మాస్టర్,హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యానికి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి నగేష్ మృతికి కారకులైన సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోని వారిని సస్పెండ్ చేయాలని,


మృతి చెందిన విద్యార్థి నగేష్ కు న్యాయం చేయాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామాన్ కు విజ్ఞప్తి చేసిన విద్యార్థి నగేష్ కుటుంబ సభ్యులు,సిపిఐ, ఎస్ఐఎఫ్, పిడిఎస్యు, డివిఎంసి, వైఎస్ఆర్ఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎ, ఎస్ఎస్ఎస్ఎఫ్ విద్యార్థి ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్ గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థి మరియు ప్రజా సంఘాల నాయకులు రమేష్ బాబు, శ్రీనివాసులు,మర్రిస్వామి, దిలీఫ్,శివ,సురేష్, కుమార్,రంగస్వామి, దినేష్,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: