మహనీయులను స్మరిద్దాం... ఆశయ సాధనకు కృషి చేద్దాం

బాలాపూర్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే  విగ్రహాలను ఆవిష్కరించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి


(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల జయంతుల పవిత్ర మాసం అని....డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిరావు పూలే వంటి మహనీయుల జయంతులు ఈ నెలలోనే జరుపుకుంటూ ఒకే దగ్గర ప్రతిష్టించుకొని అవిష్కరించుకోవటం చాలా గొప్ప విషయమని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. భారత దేశ ఔన్యత్యాన్ని చాటిన వారందరినీ స్మరిస్తూ....విగ్రహాలను ఏర్పాటు చేయటం ఎంతో అభినందనీయమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పేర్కొన్నారు.


మహనీయుల ఆశయ సాధనలో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అతి ఎత్తైన 125 అడుగుల బాబాసాహెబ్ అంబెడ్కర్ గారి విగ్రహాన్ని నగర నడి బొడ్డున నెలకొల్పి నేడు ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. వారి కలలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం వేస్తున్న అడుగులలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు.

విద్యతోనే సమాజంలో సమానత్వం, మార్పు వస్తుందని డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ బోధించినట్లు నేడు తెలంగాణ రాష్ట్రంలో విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. మహనీయుని ఆశయ సాధనను మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపుతున్న ప్రభుత్వం మనదన్నారు. దళితబంధుతో సమాజంలో మార్పు కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు.








Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: