మహనీయులు చూపిన మార్గంతో... నేటి భవిష్యత్ తరాలకు ఫలాలు

అంబెడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ రెండు కళ్ళ లాంటి వారు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

బు జగ్జీవన్ రామ్ కు మంత్రి ఘన నివాళులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా పరిగిలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కొప్పుల మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ రెండు కళ్ళ లాంటి వారని, ఇద్దరు మహనీయుల జయంతులు ఒకే నెలలో వస్తాయన్నారు. ఒకరు రాజ్యాంగం రచిస్తే మరొకరు దానిని ఆమోదించారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, నేడు రాష్ట్రంలో ఏర్పాటు అయిన నూతన జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలకు పటిష్ట రాజ్యాంగం దోహద పడిందన్నారు. భవిష్యత్తును ఊహించి నాడు మహనీయులు రూపొందించిన  లాలు నేడు అనుభవిస్తున్నాం అని అన్నారు.


డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశ ఉప ప్రధానిగా, వారి కూతురు కూడా క్రియాశీల రాజకీయాల్లో ముందుండటం ఎంతో గొప్ప విషయం అని అన్నారు. వారు చూపిన దారిలో నడుద్దాం అని, ఆశయ సాధనకు కృషి చేద్దాం అన్నారు. మాజంలో అట్టడుగు న ఉన్న వారికి విద్యా అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేజీ టూ పీజీ ఉచిత విద్యలో భాగంగా వేయి గురుకులాలు స్థాపించి, అన్నింటినీ ఇంటర్ వరకు ఆప్ గ్రేడ్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ,మున్సిపల్ చైర్మన్,కౌన్సిలర్లు,మహనీయుల జయంతి ఉత్సవ సమితి నేతలు,పార్టీ నాయకులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: