నంద్యాల జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్రాంచ్ ఆధ్వర్యంలో......

ప్రిజం జాన్సన్ లిమిటెడ్ కోటపాడు లైమ్ స్టోన్ మైన్స్ ఉద్యోగులకు....

ప్రథమ చికిత్స శిక్షణ శిబిరం

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలం, కోటపాడు గ్రామంలో ప్రిజం జాన్సన్ లిమిటెడ్ లైవ్ స్టోన్ మైన్స్ ఉద్యోగస్తులకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అనుకొని పరిస్థితులలో గుండె నొప్పి వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మూడు రోజులపాటు ప్రొఫెషనల్ ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ శిక్షణ తరగతులను ఏర్పాటు చేసామని మైన్స్ హెడ్ అశోక్ లాల్ తెలిపారు.

లైవ్ స్టోన్ మైన్స్ హెడ్ అశోక్ లాల్ గారి పర్యవేక్షణలో ఏర్పాటుచేసిన ఈ శిక్షణ తరగతులలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ పర్ల దస్తగిరి, రెడ్ క్రాస్ ప్రధమ చికిత్స శిక్షకులు వెంకటేశ్వర యూనివర్సిటీ డాక్టర్ చంద్రశేఖర్,మైన్స్ డీజీఎం బాలచంద్ర,మైన్స్ మేనేజర్ శశాంక్,మైన్స్ హెచ్ఆర్ శ్రావణ్,రెడ్ క్రాస్ జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు,సంజామల మండల నాయకులు నరసింహమూర్తి, కొలిమిగుండ్ల మండల నాయకులు హుస్సేన్ వల్లి, చిత్తూరుజిల్లా రెడ్ క్రాస్ డిఎఫ్ఓ చిరంజీవి, నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ డిఎఫ్ఓ రాజునాయక్ మరియు లైమ్ స్టోన్ మైన్స్ లో పనిచేసే ఉద్యోగులకు మరియు సిబ్బంది 30 మందికి అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. 

ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ గారు లైవ్ స్టోన్ మైన్స్ ఉద్యోగస్తులకు అనుకోని పరిస్థితులలో గుండె నొప్పి వచ్చి అపస్మారస్థితిలో వెళ్ళినప్పుడు వెంటనే సహచర ఉద్యోగులు చేయవలసిన ప్రథమ చికిత్స గురించి,సిపిఆర్ విధానం చేయడం వల్ల ప్రాణాపాయ స్థితి నుండి కాపాడవచ్చునని, అత్యవసర పరిస్థితులలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రొజెక్టర్ ద్వారా మరియు చార్ట్ ల ద్వారా,ప్రధమ చికిత్స పరికరం ద్వారా ఉద్యోగస్తులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: