బుక్క కృష్ణ ఆధ్వర్యంలో...

పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికీ బిజెపి ..కార్యక్రమం

ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఓబీసీ ఇంచార్జి, బీహార్ ఎమ్మెల్యే అరుణ్ శంకర్ ప్రసాద్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

రాష్ట్ర *ఓబీసీ ఇంచార్జి, బీహార్ ఎమ్మెల్యే అరుణ్ శంకర్ ప్రసాద్ తో కలిసి బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యనిర్వాహక సభ్యులు బుక్క కృష్ణ, జిల్లా ఓబీసీ మోర్చ అధ్యక్షులు లక్ష్మి నారాయణ, శంషాబాద్ మండల ఓబీసీ అధ్యక్షులు మల్చాలం మోహన్ శుక్రవారం నాడు రాజేంద్రనగర్ నియోజకవర్గ పెద్ద గోల్కొండ గ్రామంలో "పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికీ బిజెపి" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదిలా ఉంటే రాజేంద్రనగర్ నియోజకవర్గంలో రెండు రోజుల పాటు జరిగిన పల్లె పల్లెకు ఓబీసీ ఇంటింటికీ బిజెపి కార్యక్రమాన్ని ముగించుకొని ఎయిర్పోర్ట్ వెళ్తూ మార్గమధ్యలో బిజెపి జాతీయ ఓబీసీ మోర్చ అధ్యక్షులు డా. కె. లక్ష్మణ్ ను  బీహార్ ఎమ్మెల్యే అరుణ్ శంకర్ ప్రసాద్, రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యనిర్వాహక సభ్యులు బుక్క కృష్ణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: