మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన..

ఘనంగా మహేశ్వరం నియోజకవర్గ ప్లీనరీ...

వెలదిగా తరలి వచ్చిన బి అర్ ఎస్ శ్రేణులు

కెసిఆర్ పథకాలతో యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తోంది

నినాదించిన బీఆర్ఎస్ నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన మహేశ్వరం నియోజకవర్గ బిఅర్ఎస్ కార్యకర్తల ప్లీనరీ సమావేశం విజయవంతంగా కొనసాగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం  సుల్తాన్ పూర్ సమీపంలో  మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల  ప్లినరి సమావేశం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగింది. ఈ సమావేశానికి పార్టీ  నేతలు, కార్యకర్తలు  నియోజకవర్గ  ప్రాంతాల నుండి  భారీ ర్యాలీలతో   సభస్థలికి తరలివచ్చారు.


ముందుగా సభ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండా ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పలు తీర్మానాలు చేశారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ రంగం, సామాజిక భద్రత, మహిళ శ్రేయస్సు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళితబందు, విద్యుత్ రంగం, విద్యా, వైద్య రంగం, బీసీ, మైనార్టీ సంక్షేమం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, నియోజకవర్గ అభివృద్ధితోపాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల పై ఈ ప్రతినిధుల సమావేశంలో తీర్మానాలు


చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై తీర్మానాలు చేసారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేసారు. సీఎం  కేసీఆర్  తీసుకొచ్చిన విధానాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు.. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి గుణాత్మకమైన పాలనను అందించడం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు... ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, మాజీ మేయర్ కృష్ణారెడ్డి, యువ నేత కౌశిక్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: