పద్మ భూషణ్
శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామికి....
ఘన స్వాగతం పలికిన బుక్క వేణుగోపాల్ యువసేన
భారీ కాన్వాయ్... బైకు ర్యాలీతో స్వామివారికి ఘన స్వాగతం
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
పద్మ భూషణ్ అవార్డు గ్రహీత శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామికు బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ యువసేన ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. *శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామివారిని* “కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డుతో” అలంకరించినంతరం మెదటిసారి భాగ్యనగరానికి విచ్చేసిన సందర్భంగా స్వామివారికి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పిలుపు మేరకు బుక్క వేణుగోపాల్ ఆయన యువసేన ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్, 500 మంది బైక్ ర్యాలీతో శంషాబాద్ విమానాశ్రయంలో స్వామివారికి ఘన స్వాగతం పలికారు.
స్వామివారి ప్రియశిష్యులు- బిజెపి రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యనిర్వాహక సభ్యులు బుక్క కృష్ణ , శంషాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షులు-జూకల్ ఎంపీటీసీ బుక్క ప్రవీణ్ తదితరులు బుక్క వేణుగోపాల్ యువసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా కోలాహలలతో అడుగడుగునా స్వామివారికి బ్రహ్మరథం పడుతూ సమతా మూర్తి జీయర్ ఆశ్రమం వద్ద వరకు *శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామివారిని, స్వామివారి ప్రియశిష్యులు బుక్క కృష్ణ తన రథంలో ఊరేగింపుగా* తీసుకెళ్లి భారీ గజ మాలతో స్వామివారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో నర్కుడ ఎంపీటీసీ గౌతమీ అశోక్, గోనే వెంకటరమణ, కనకమామిడి కిట్టు, మల్చలం మహేష్, బూరుకుంటా నగేష్ , పర్వతం వినోద్ కుమార్ , మెడిబాయ్ శ్రీనివాస్, బూరుకుంటా భాస్కర్ , అంజి , పన్నీ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పద్మ భూషణ్ శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామికి.... ఘన స్వాగతం పలికిన బుక్క వేణుగోపాల్ యువసేన,,, భారీ కాన్వాయ్... బైకు ర్యాలీతో స్వామివారికి ఘన స్వాగతం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: