పెరిగిన విద్యుత్ చార్జీలపై నిరసనగా
గడివేముల సబ్స్టేషన్ వద్ద టిడిపి నేతల ధర్నా
విద్యుత్ చార్జీలు పెంచి దగాచేసిన ప్రభుత్వం...దేశం సత్యనారాయణరెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా గడివేముల మండలంలో పెరిగిన విద్యుత్ చార్జీలపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునివ్వడంతో నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం మాజీ శాసనసభ సభ్యురాలు గౌరు చరితారెడ్డి ఆదేశాల మేరకు గడివేముల స్థానిక కరెంటు సబ్స్టేషన్ వద్ద మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, రైతుల బోర్లకు మీటర్లు బిగించడంపై నిరసన వ్యక్తం చేస్తూ గడివేముల మండల టిడిపి నాయకులు నిరసన మరియు ధర్నా కార్యక్రమం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ దేశం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ
రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రజలపై విద్యుత్ చార్జీలు 7సార్లు పెంచారని, సామాన్య మానవునికి సైతం ఉపయోగపడే విద్యుత్ పై వైసిపి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు రెండింతలు పెంచారని, రైతులు పంట పండించేందుకు ఉపయోగించే విద్యుత్ మోటార్లకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయడం రైతన్నలను దగా చేయడమేనని రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతులు పండించే పంటలకు విద్యుత్ మోటార్లకు విద్యుత్ మీటర్లను బిగించి రైతన్నల నడ్డి విరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గడివేముల మండల టిడిపి నాయకులు మంచాలకట్ట శ్రీనివాసరెడ్డి, బుజనూరు రామచంద్రా రెడ్డి, దుర్వేసి కృష్ణ యాదవ్, ముస్లిం మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫరూక్, శ్రీనివాసరెడ్డి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సుభద్రమ్మ, చిందుకూరు సర్పంచ్ అనసూయమ్మ, వడ్డు లక్ష్మీదేవి, టిడిపి మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పెరిగిన విద్యుత్ చార్జీలపై నిరసనగా,,, గడివేముల సబ్స్టేషన్ వద్ద టిడిపి నేతల ధర్నా,,, విద్యుత్ చార్జీలు పెంచి దగాచేసిన ప్రభుత్వం...దేశం సత్యనారాయణరెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: