రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి...మరొకరికి గాయాలు

(జానో జాగో వెబ్  న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా మహానంది మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తి గాయ పడ్డారు. నంద్యాల మహానంది రహదారిలోనీ బొల్లవరం,సుగాలిమిట్ట రహదారి మధ్యలో మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన జగడం సురేష్, తమ్మడపల్లె గ్రామానికి చెందిన డక్క ముని అనే ఇద్దరు మోటార్ సైకిల్ పై నంద్యాలకు పోవుచుండగా నంద్యాల వైపు నుండి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో జగడం సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడ్డ ముని ని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు.




Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: