మేకల కాదు... పులుల బతుకుదాం

అంబేద్కర్ చెప్పిన ఆ మాటలను ఆచరిద్దాం

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పిలుపు

బిఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన..బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మేకల్ని బలి ఇస్తారు, కానీ పులులను బలి ఇవ్వరు, కాబట్టి పులుల్లా బతకండి అంటూ భారతరత్న బాబా సాహెబ్ డా|| బి.ఆర్. అంబేడ్కర్ మాటలను ప్రతి భారతీయుడు ఎప్పటికి మరువరాదు అని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి బుక్క వేణుగోపాల్ పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ శంషాబాద్ మండల కేంద్రంలోని ఆర్థిక వేత్త, రాజనీతిజ్ఞుడు, అంటరానితనం వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న  బాబా సాహెబ్ డా|| బి.ఆర్. అంబేడ్కర్ అని ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని ఆశయ సాధనకై వారి విగ్రహానికి బిజెపి ఓబీసీ మోర్చ జాతీయ ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఓబీసీ మోర్చ ఇంచార్జి అరుణ్ శంకర్ ప్రసాద్ తో  కలిసి పూలమాల వేసి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ ఘన నివాళులు అర్పించారు.







Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: