కుల వృత్తులకు కేసిఆర్ పెద్దపీట వేశారు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కుమ్మర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో.

ముఖ్య అతిధిగా పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

 మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని  కందుకూరు మండల కేంద్రంలోని  సామ నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహేశ్వరం నియోజకవర్గం స్థాయి  కుమ్మర ఆత్మీయ సమ్మేళన  కార్యక్రమమానికి విద్యా శాఖ మంత్రి  పి సబితా ఇంద్రారెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కుమ్మర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన   మంత్రికి కుమ్మర కుటుంబ సభ్యులు ఆత్మీయ  స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పాత కాలంనుండి నేటి వరకు కుమ్మర వృత్తి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని అని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో ఆదరణకు దూరంగా ఉన్న కులాలకు ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రత్యేకంగా గుర్తించి కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.  సామాజికంగా ఆర్థికంగా బల పడేలా కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, మహేశ్వరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ సిలివేరి సాంబశివ, స్థానిక ప్రజాప్రతినిధులు, కుమ్మర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.









Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: