భారత రాజకీయాలలో తిరుగులేని ముద్ర వేసిన బిజెపి

పార్టీ ఆవిర్భావ దినోత్సవం లో బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్


(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

భారత రాజకీయాలలో బిజెపి పార్టీ తిరుగులేని ముద్ర వేసిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ నియోజకవర్గ నర్కూడ గ్రామంలో బూత్ అధ్యక్షుల ఆధ్వర్యంలో నిర్వహించిన బిజెపి జెండా ఆవిష్కరన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్ధాంతాలు, విలువలతో కూడిన జాతీయ పార్టీలో మనందరం భగ్యస్వాములుగా ఉండడం మనందరి అదృష్టమని పార్టీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన అన్నారు. భారత్ దేశాన్ని విశ్వగురువుగా నిలపగల సత్తా ఉన్న పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే అని ఆయన తెలియజేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: