వెలుగోడు పట్టణ ముస్లింల చిరకాల కోరికను నెరవేర్చిన....

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా వెలుగోడు మండలంలోని స్థానిక వెలుగోడులోని శ్రీమతి రొఖియాభి అమ్మవారి దర్గా వెనుక ఉన్న ముస్లింల స్మశాన వాటికకు ఇరువైపుల ఉన్న సీసీ రోడ్డు ఎత్తుగా ఉండడంతో వర్షాకాలంలో వర్షం పడినపుడు వర్షపు నీరు అంతా చేరి స్మశాన వాటికలో మొత్తం గుంతలు ఏర్పడి సమాధులు తీసుకొనుటకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, స్థానిక ముస్లిం పెద్దలు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే సమస్య పై స్పందించి తన సొంత నిధులతో టిప్పర్లతో మట్టితో గుంతలు సమంచేసి నీరు నిలువకుండా చేసి చిరకాల సమస్యకు వెంటనే స్పందించి పరిష్కారం చేసి, స్మశాన వాటికను సందర్శించడానికి వచ్చిన ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డికి ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో వెలుగోడు మండల ముస్లిం కమ్యూనిటీ సభ్యులు, ముస్లిం సోదరులు,ప్రజా ప్రతినిధులు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: