సమాజ సేవలో ఆర్యవైశ్య మహాసభ ఎప్పుడూ ముందుంటుంది

హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్త

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

సమాజ సేవకు ఎప్పుడు ఆర్యవైశ్య మహాసభ ముందుంటుంది హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్త వెల్లడించారు. తమ సంఘం తరఫున ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు జరిగాయని, తాను కూడా మునుముందు వాటిని కొనసాగిస్తానని ఆయన తెలిపారు. దూద్ బౌలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దొరేటి ఆనంద్ గుప్త అధ్యక్షతన నూతనంగా ఎన్నికైన హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్తతో పాటు ఇతర కమిటీ సభ్యులకు  దూద్ బౌలి శ్రీ వాసవి భవన్లో సన్మాన కార్యక్రమం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు సరాబు లక్ష్మణ్ గుప్త మాట్లాడుతూ సంఘం తరఫున చేపట్టే వివిధ కార్యక్రమాలను వెల్లడించారు. ఈనెల 16న లకిడికపూల్ లోని శ్రీ వాసవి భవన్లో నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని వెల్లడించారు. 98వ సనాతన వేదాంత విజ్ఞాన మహాసభ వచ్చే ఏడాది నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వీటితోపాటు ఆర్యవైశ్యులకు సంబంధించి పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. 


ఇంకా ఆయన సంఘం చేయబోయే కార్యక్రమాల  గురించి ఇలా వివరించారు.........  సుమారు 1975 సంవత్సరంలో కల్వ సూర్యనారాయణ, మరికొంతమంది పెద్దలచే స్థాపించ బడిన హైదరాబాద్ పట్టన ఆర్యవైశ్య సంఘం 50 వసంతాలకు చేరువలో ఉన్నది. గడిచిన 48 సంవత్సరాలుగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్నది. అంతే కాకుండా మాజీ అధ్యక్షులు అందరూ కూడా పేద వైశ్యులకు, వైశ్యతరులకు అన్ని విధాలుగా విద్యా, వైద్యం, ఆర్ధికంగా వెనుకబడిన వారికి సహాయ సహకారాలు అందిస్తు వస్తున్నారు. నేను గత 40 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఆర్యవైశ్య సంఘం లాల్ దర్వాజ - గొలిపుర 2008 వ సంవత్సరంలో అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. అంతే కాకుండా పలు దేవాలయాలకు ట్రస్ట్ సభ్యునికిగా, ఎండోమెంట్ బోర్డ్ మెంబర్ గా, వాసవి అన్న సత్రాలకు ట్రస్ట్ సభ్యునికి, కార్యదర్శిగా, ఉపాధ్యక్షునికి, ప్రధాన కార్యదర్శిగా మరియు ఏర్పాడు వ్యాసాశ్రమం సద్గురు శ్రీ మలయాళ స్వామి వారి ఆశ్రమనికి సేవలందిస్తు అన్నాను.


తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తరువాత హైదరాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘాన్ని హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ గా రూపుదిద్దుకుంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభకు నన్ను 2023-2025 సంవత్సర కాలానికి 22వ అధ్యక్షులుగా ఎన్నుకొన్న వారందరికి వినమ్రంగా నా యొక్క కృతజ్ఞతాభివందనాలు తెలియచేస్తున్నాను.ప్రతిష్టాత్మకమైన జిల్లా స్థాయి నాయకత్వ భాద్యతలు నాకు దక్కడం పూర్వజన్న సుకృతంగా భావిస్తున్నాను. త్యార్ల అభిమన్యం గుప్త అధ్యక్షతన నేను హైదరాబాద్ పట్టణ ఆర్యవైశ్య సంఘం లో కార్యవర్గ సభ్యునిగా మొదలై, కూర జయరాములు గుప్త  కార్యవర్గంలో సహాయ కార్యదర్శిగా, సేవలందించాను అంతే కాకుండా సద్గురు మలయాళ స్వామి వారి 76వ సనాతన వేదాంత జ్ఞాన మహాసభలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహించడం జరిగింది అందులో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. కాసనగొట్టు రాజశేఖర్ గుప్త, కొండ్ల మల్లికార్జున్ గుప్త, గుడిశెట్టి అశోక్ కుమార్ గుప్త, బొగ్గారపు దయానంద్ గుప్త యం.ఎల్.సి., అల్లాడి నాగభూషణం గుప్త కార్యవర్గంలో ఉపాధ్యక్షునిగా కాశెట్టి పాండు గుప్త కార్యవర్గంలో గ్రీటింగ్స్ కమిటి చైర్మన్ గా, రెడ్డిశెట్టి చంద్రశేఖర్ రావు కార్యవర్గంలో కోశాధికారిగా,


మ్యాడం దయకర్ గుప్త కార్యవర్గంలో ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తు వస్తున్నాను.. గత ఎన్నో ఏళ్ళుగా మన పెద్దలు జిల్లా ఆర్యవైశ్య సభ ద్వారా ఎంతోమంది సామాజికులకు తోడ్పాటు అందించడానికి అనేక పద్ధతుల ద్వారా ఆర్ధిక సహాయాలు అందించారు. వారి ఆశయాలను నెరవేర్చడానికి నా శాయశక్తుల కృషి చేస్తూ అందరి మన్ననలను పొందేవిధంగా నడుచుకుంటానని తెలియజేస్తున్నాను. అన్ని బస్తీ సంఘాల సమన్వయంతో కార్యక్రమాలు చేస్తానని తెలియచేస్తున్నాను.

నా పదవీ కాలంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలు తెలియ చేస్తున్నాను. "లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు. పుణ్యం ఆశించే చేస్తే సాయం అంటారు. ఏమి ఆశించకుండా చేస్తే సేవా అంటారు", మా సంఘం తరఫున శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి, వధూవరుల పరిచయ వేదిక, విధ్యార్థిని, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, సిల్వర్ మెడల్స్, కార్తీక వనభోజనాలు, వినోద విహార యాత్ర, విదేశీ యాత్ర 12. సభ్యులకు వినోద కార్యక్రమం, సినిమా, 98వ సనాతన వేదాంత విజ్ఞాన మహాసభ-2024, కపుల్స్నేట్,.శివపార్వతుల కళ్యాణం, మట్టి గణపతుల పంపిణీ, అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం విద్యార్థులకు లాంగ్ నోట్ బుక్స్ పంపిణీ , విధ్యార్ధిని, విధ్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్,  దీపావళి టపాకాయలు', బతుకమ్మ వేడుకలు, సంక్రాంతి సంబరాలు, మెడికల్ మరియు హెల్త్ క్యాంపుల నిర్వహణ, దసరా సమ్మేళనం 17. శ్రీనివాస కళ్యాణం. అవార్డ్స్ నైట్,కోటిదీపోత్సవం కార్యక్రమంలో ప్రసాద వితరణ, బిల్డింగ్ ఆధునీకరణ, లిఫ్ట్ ఏర్పాటు, మహిళా విభాగం ఏర్పాటు, వాసవి సేవాదళ్ ఏర్పాటు, ఏదైనా పుణ్యక్షేత్రంలో ఈ.సి, మీటింగ్ యువజన విభాగం ఏర్పాటు చేస్తాం.


మాజీ అధ్యక్షుల సలహాలు, సూచనల మేరకు ప్రోత్సాహం, ప్రోద్భలంతో మరెన్నో కార్యక్రమాలను చేపట్టాలని అభిలాషిస్తున్నాను, 'ధనం మూలం ఇదం జగత్' రాబోవు రెండు సంవత్సరాలకు నూతన కార్యవర్గ సభ్యులందరూ తనువుతో, మనసుతో, ధనంతో సహకరించి కార్యక్రమాలు విజయవంతం చేయడంలో తోడ్పాటు అందించాలని నా యొక్క మనవి. నా పదవి కాలానికి "మనం వేసే ప్రతి అడుగు మన ప్రగతికి ముందడుగు" అనే నినాదంతో మీ ముందుకు వస్తున్నాను, ఆశీర్వదించాలని నా యొక్క మనవి. అనవాయితి ప్రకారంగా ఈ సారి కూడా భారీ కార్యవర్గం రూపుదిద్దుకుంది. అందులో భాగంగా నా యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాను. అని ఆయన వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కటకం శివ కుమార్, కోశాధికారి లింగా ప్రకాష్ గుప్తా, ఉపాధ్యక్షులు అడ్మినిస్ట్రేషన్ రేపాక వెంకటేశ్వర్లు,  అదనపు ప్రధాన కార్యదర్శి కొక్కొళ్ళ సత్యం గుప్త, సహాయ కోశాధికారి చింతల్ ఘాట్  శ్రీరాం, పీఆర్వో దేవత శ్రీనివాస్ రావు, అమావాస్య అన్నప్రసాద కమిటి చైర్మన్ రెడ్డిశెట్టి చంద్రశేఖర్ రావు, పొలిటికల్ కమిటీ చైర్మన్ దొరేటి ఆనంద్ గుప్త, మీడియా కమిటి చైర్మన్ గార్లపాటి ప్రభాకర్, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గందె హన్మంత్ రావు, తిపిరిశెట్టి శ్రీనివాస్, కొండూరు సృజన్, కొడిత్యాల ప్రదీప్, గ్రీటింగ్స్ కమిటీ చైర్మన్, వాసవి సేవాదళ్ అధ్యక్షులు కూన వెంకట గోపాలకృష్ణ, మహిళా విభాగ్ అధ్యక్షురాలు కొమిరిశెట్టి స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: