భక్తిశ్రద్దలతో రంజాన్ పండుగ ప్రార్థనలు

భారీ సంఖ్యలో పాల్గొన్న ముస్లిం సోదరులు

ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న నంద్యాల ఎమ్మెల్యే,జిల్లా కలెక్టర్,ఎస్పీ

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు.నంద్యాల జిల్లా కేంద్రంలోని మసీదులలో,ఈద్గాల వద్ద వేలాదిమంది ముస్లిం సోదరులు పవిత్ర ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ ప్రార్థనలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి,ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకున్నారు.నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి,జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాన్ సమూన్,జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనదని,నెలరోజులు కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈద్-ఉల్-ఫితర్ పండుగ ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారని, ముస్లింలకు ముఖ్యమైన ఐదు పూటలా నమాజ్, జకాత్,రోజాను రంజాన్ మాసంలో త్రికరణ శుద్ధిగా ఆచరిస్తారని,ఈ పవిత్ర మాసంలో పవిత్ర దివ్య ఖురాన్ గ్రంథం అవతరించిందని,
గడివేములలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న ముస్లిం సోదరులు

 

పండుగలు మానవ జీవితంలో భాగమై మన జాతీయతకు,సంస్కృతికి, వికాసానికి దోహదం చేస్తున్నాయని,పండుగలు మానవాళికి హితాన్ని  బోధిస్తున్నాయని ,ముస్లింలు చాంద్రమాన క్యాలెండర్ అనుసరించి ఇస్లామియా క్యాలెండర్ ను అనుసరించి రంజాన్ పండగను జరుపుకుంటారని, క్రమశిక్షణ,దాతృత్వం, ధార్మిక చింతన వీటి కలయికే రంజాన్ పండగని,  నంద్యాల పట్టణం మతసామరస్యతకు ప్రతీకగా నిలిచిందని,ఆ అల్లా దీవెనలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు.మసీదుల వద్ద, ఈద్గాల వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: