అకాల వర్షాలతో...

వందలాది ఎకరాల్లో నేలకొరిగిన వరి పంట

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలోని జెసి పాలెం, లింగాపురం,రామాపురం, సంత జూటూరు, నారాయణపురం గ్రామాలలో రాత్రి కురిసిన అకాల వర్షాలకు వందల ఎకరాలలో వరి పంట నేలకొరిగింది.దేశానికి వెన్నెముక అన్నదాత అయిన రైతు వెన్నులో వణుకు పుట్టేలా రాత్రి కురిసిన అకాల వర్షంతో వందలాది ఎకరాల్లో చేతికి అందిన వరి పంట నేలపాలైంది. ఉదయం పొలం వద్దకు వెళ్ళిన రైతన్నల గుండెల్లో గుబులు పుట్టేలా వరి పంట నేలకు ఒరిగి ఉండడం చూసి  రైతు కంట కన్నీరు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.పంటలు బాగా పండి దిగుబడులు బాగున్నాయని,పండించిన ధాన్యాలకు ధరలు బాగున్నాయని,


ఈ సంవత్సరం తమ అప్పులు అన్ని తీరుతాయని అనుకుంటున్న సమయంలో వరి పంట కాస్త వర్షార్పణం కావడంతో అన్నదాతలు అయోమయ పరిస్థితులలో ఉన్నామని రైతులు కన్నీరు కారుస్తున్నారు. ప్రభుత్వం దయదలచి తమన ఆదుకుంటే తప్ప తమ కష్టాలు గట్టెక్కవని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వంకిదృష్టికి తీసుకెల్లితే తప్ప తమ కష్టాలు తీరని రైతులు కన్నీ కంటతడి పెడుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: