అన్ని మతాల శ్రేయస్సు కోసం కేసీఆర్ కృషి
రాష్ట్రంలోని పండుగలలో ఆధ్యాత్మికత వెల్లువిరుస్తోంది
పలు ఇఫ్తార్ విందులలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
మహేశ్వరంలో పెద్ద మసీదు వద్ద జరిగిన ఇఫ్తార్ విందుకు ముఖ్య అతిథిగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. అదే సందర్భంలో మహేశ్వరం మండలం నందుపల్లి గ్రామంలో ఇఫ్తార్ విందులో పాల్గొని పేద ముస్లింలకు రంజాన్ తోఫాలను అందజేసారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదర, సోదరీమణులకు పవిత్ర రంజాన్ మాసం శుభాకాంక్షలు తెలిపారు.
ఇఫ్తార్ పార్టీలు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రం లో పండుగలలో ఆధ్యాత్మిక వెల్లివిరుస్తుందని, అన్ని మతాల శ్రేయస్సు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. దసరా సందర్భంగా చీరల పంపిణీ, క్రిస్మస్ గిఫ్ట్ లు, రంజాన్ తోఫా అందిస్తున్నట్లు తెలిపారు.
Home
Unlabelled
అన్ని మతాల శ్రేయస్సు కోసం కేసీఆర్ కృషి,,, రాష్ట్రంలోని పండుగలలో ఆధ్యాత్మికత వెల్లువిరుస్తోంది,,,, పలు ఇఫ్తార్ విందులలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: