కేసీఆర్ భండారంం బయటపెడుతారన్న భయంతోనే

బండి సంజయ్ అక్రమ అరెస్ట్

తమ నేతను వెంటనే విడుదల చేసి,,,క్షమాపణ చెప్పాలి

లేకపోతే మరో ఉద్యమం తప్పదు

బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్  న్యూస్-రాజేంద్ర నగర్  ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్ కు నిరసనగా  రాజేంద్రనగర్ నియోజకవర్గలోని బీజేపీ శంషాబాద్ మండల రూరల్ అధ్యక్షులు చిటికెల వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు కోణమొల దేవేందర్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ తోపాటు  సిద్ధిపేట ఇంచార్జి అంజన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ...


కేసీఆర్ అవినీతి బండారం బయటపెడుతారన్న భయంతోనే  బీఆర్ఎస్ సర్కార్ ఆయన్ని అర్థరాత్రి  అరెస్ట్ చేయించిందని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశమైన మన దేశంలో ఇలాంటి అరెస్ట్ చాలా దురదుష్టకరణమని ఆయన పేర్కొన్నారు.  ఇలాంటి పిరికిపంద చర్యల ద్వారా కెసిఆర్ తానొక అసమర్థ పాలకుడిగా మరోసారి నిరూపించుకున్నాడని తీవ్ర స్థాయిలో బుక్క వేణుగోపాల్ ధ్వజమెత్తారు. బేషరతుగా బీసీ నాయకుడైన, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే విడుదలచేసి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్  చేశారు.  లేని పక్షంలో "బతుకు తెలంగాణ బడుగు తెలంగాణ" కోసం మరో ఉద్యమం తప్పదని తీవ్రంగా బుక్క వేణుగోపాల్ హెచ్చరించారు. 

ఈ కార్యక్రమంలో బిజెపి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నందకిశోర్ గుప్తా, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు లక్ష్మి నారాయణ, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి నానావల్ల కుమార్, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీధర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు కొప్పుల ప్రశాంత్ ,  బిజెపి నాయకులు లక్ష్మయ్య, అనేగోని భాస్కర్ గౌడ్, మెండే కుమార్ యాదవ్,  మహిపాల్ రెడ్డి,సెవెళ్ల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: