బీఆర్ఎస్ లో భారీగా చేరికలు,,,

మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన యువత

గులాబీ గూటికి జల్పల్లి మున్సిపాలిటీ శ్రీరామ కాలనీ కి చెందిన వివిధ పార్టీల నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ పార్టీ నిండుకొంటోంది. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని జల్పల్లి మున్సిపాలిటీ,.. శ్రీరామ కాలనీ చెందిన 40 మంది యువకులు జల్పల్లి మాజీ సర్పంచ్,రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘ అధ్యక్షులు, ప్రస్తుత జల్పల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు సూరెడ్డి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో  మంత్రి  పి. సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.  ఆదివారంనాడు సబితా ఇంద్రారెడ్డి క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలసి వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరేవారిని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... యువతే దేశ భవిష్యత్తు, యువకులందరూ పార్టీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు. పనిచేసే కార్యకర్తలందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.


ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్స్ .కే లక్ష్మీనారాయణ, పల్లపు శంకర్, యువ నాయకులు, డైనమిక్ లీడర్ .యంజాల అర్జున్, బిసి సెల్ మున్సిపల్ అధ్యక్షులు  ఉస్కెమూరి  నిరంజన్ నేత, ఎస్సీ సెల్ అధ్యక్షులు.చెన్నం రాజేష్ 16వ వార్డు అధ్యక్షులు పోలేమోనీ నాగేష్ ముదిరాజ్ , సీనియర్ బిఆర్ఎస్ నాయకులు సూరెడ్డి సత్తిరెడ్డి, కొంగర  సుభాష్, గుండు నర్సింగ్ , రాజు, మున్సిపల్ మహిళా ఉపాధ్యక్షురాలు కర్నాటి పద్మ, మహిళా నాయకురాలు  జి లక్ష్మి, మాజీ వార్డ్ మెంబర్ కరణమ్మ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.





Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: