హనుమాన్ శోభాయాత్రలో పాల్గొన్న..

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

ఘనంగా ఆహ్వానించిన పార్టీ నేతలు


(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

హనుమాన్ జన్మదినోత్సవ సందర్బంగా అమ్మపల్లి అభయ ఆంజనేయ స్వామి వద్ద కెవిఎం బ్రదర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అథితిగా బిజెపి రాష్ట్ర నాయకులు బొక్క వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అభయ ఆంజనేయ స్వామి విగ్రహం నుండి నర్కూడ, చౌదురిగూడ మీదుగా బైక్ ర్యాలీతో శంషాబాద్ లో జరిగిన


హనుమాన్ శోభాయాత్రలో బుక్క వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో హనుమాన్ ఉత్సవ కమిటీ వారు శంషాబాద్ శోభాయాత్ర వద్ద బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ కు ఘనంగా స్వాగతించి సన్మానించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బుక్క వేణుగోపాల్ శోభాయాత్రను ముందు నడిపించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: