దూద్ బౌళి టీసీసీ ఎన్నిక

అధ్యక్షులుగా యాదయ్యగౌడ్, 

ఉపాధ్యక్షులుగా బొంగు నరేందర్ గౌడ్

కల్లుగీత కార్మికుల అభ్యున్నతికి కృషి...యాదయ్య గౌడ్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

టాడీ టాపర్ కో-ఆపరేటివ్ సొసైటీ దూద్ బౌళి (టీసీసీ) ఎన్నికలు బుధవారం దూద్ బౌళిలోని కార్యాలయంలో నిర్వహించారు. ఎన్నికల అధికారి శ్రీధర్, చార్మినార్ ఎక్సైజ్ ఎన్ఐ రాఘవేంద్ర పరిరక్షణలో ఈ ఎన్నికలు జరిగాయి. సంఘం సభ్యుల సమక్షంలో జరిగిన ఈ ఎన్నికలలో దూద్ బౌళి టీసీసీ అధ్యక్షులుగా యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షులుగా బొంగు నరేందర్ గౌడ్, కార్యదర్శిగా ఎం. గోపీ గౌడ్, డైరెక్టర్లుగా ముప్పిడి మురళీధర్ గౌడ్, ప్రహాలాద్ గౌడ్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఈనందర్భంగా నూతన అధ్యక్షులుగా నియమితులైన యాదయ్య గౌడ్ మాట్లాడుతూ కల్లుగీతా కార్మికలు అభ్యున్నతికి పాటుపడతానని ఆయన తెలిపారు. గీతా కార్మికులకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అర్హులైన గీతా కార్మికులందరికి అందేలా తనవంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: