దళితుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
సిపిఐ (యంఎల్)ఆర్ఐ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్న దాడులపైన రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే పెడ్డింగ్ లో వున్న యసి,యస్టి కేసులను పరిష్కరించాలని సిపిఐ (యంయల్) ఆర్ఐ పార్టి జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్ ఆరోపించారు. నంద్యాల పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అమరులైన దళిత నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్,బాబు జగజ్జివన్ గారి జయంతి వర్థంతులకు పూలమాలలు వేసి నివాళులు అర్పించినంత మాత్రాన వారి ఆశయాలను నెరవేరవని,దళితుల పట్ల జరుగుతున్న దాడులకు దళితుల కాలనీలోనీ సమస్యలు పరిష్కరించినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతారని,జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత దళితుల సమస్యలు పట్టిచుకోవడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా దళితుల సమస్యలు వెంటనే పరిష్కరించి వారికి నిజమైన నివాళులర్పించాలని డిమాండ్ చేశారు.
Home
Unlabelled
దళితుల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం,,,, సిపిఐ (యంఎల్)ఆర్ఐ జిల్లా కార్యదర్శి గాలి రవిరాజ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: