అంబేద్కర్ ఆశ సాధన దిశగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)
రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని, అంబేద్కర్ చౌరస్తాలో భారత రాజ్యాంగ నిర్మాత ,భారతరత్న డాక్టర్. బి. ఆర్. అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి ఘన నివాళులు అర్పించారు. దేశానికి దిశ,దశ చూపిన మహనీయులు బాబా సాహెబ్ అంబెడ్కర్, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు పాటుపడలన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఆ మహనీయుని పేరును రాష్ట్ర సచివాలయానికి పెట్టడమే కాకుండా125 అడుగుల అతి ఎత్తైన విగ్రహాన్ని నెలకొల్పటం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ ఆశయ సాధనలో ముందుందని మంత్రి పేర్కొన్నారు. అందరూ చదువుకుంటేనే సమాజంలో సమానత్వం వస్తుందని, ఆ దిశలో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యకు పెద్ద పీట వేస్తున్నారన్నారు.
Post A Comment:
0 comments: