ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లండి

పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ నేతల పిలుపు

మొఘల్ పుర  డివిజన్ లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నేతలు  పుస్తె శ్రీకాంత్ సల్లావుద్దీన్ లోది పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శనివారంనాడు  సుధాసినీ ఎదురుగా మొఘల్ పుర  డివిజన్ బీఆర్ఎస్ నేతల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి హైదరాబాద్  పార్లమెంటు బీఆర్ఎస్ ప్రెసిడెంట్  పుస్తె శ్రీకాంత్, చార్మినార్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన సల్లావుద్దీన్ లోది మఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ప్రభుత్వ సంక్షేమ పథకాలు జనంలోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి పాటుపడాలని కోరారు.  జనంతో  పార్టీ నేతలు  మమేకం కావాలన్నారు. మొఘల్ పుర  బీఆర్ఎస్ ప్రెసిడెంట్  రాధాకృష్ణ మాట్లాడుతూ.. త్వరలో మొఘల్ పుర డివిజన్ లో వందమందితో  పార్టీ కమిటీ వేస్తామని ఆయన తెలిపారు. 


నిత్యంజనంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు.  ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేస్తామన్నారు. అనంతరం పుస్తె శ్రీకాంత్. సల్లావుద్దీన్ లోదిలను ఈ సందర్భంగా రాధాకృష్ణ. ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో  బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ,గోపి యాదవ్,  సలీం, విజయకుమార్, అరుణ, నీరజ, దాస్., సోను, సునీత,  తదితరులు. పాల్గొన్నారు...
Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: