నేలకొరిగిన రెండు విద్యుత్ స్తంభాలు.....

తప్పిన పేను ప్రమాదం

విద్యుత్ అధికార్ల నిర్లక్ష్యతీరుపై మండిపడుతున్న గడివేముల వాసులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని గడివేముల గ్రామంలో పెద్ద ప్రమాదం తప్పింది. గడివేముల గ్రామంలోని పాత బస్టాండ్ వద్ద రెండు విద్యుత్ స్తంభాలు విరిగి నేలమీద పడ్డాయి. ఆ విద్యుత్  స్థంభాలు రహదారి ప్రక్కన ఆగి ఉన్న  ద్విచక్ర వాహనాలు మీద పడడంతో ద్విచక్ర వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలో రోడ్డుపై రాకపోకలు సాగుతున్నా స్థంబాలు పడే సమయానికి కరెంటు తీగలు రహదారిపై వెళుతున్న ప్రజలపై ప్రయాణికులపై పడకపోవడంతో భారీ ప్రాణం నష్టం తప్పింది. గతంలో విద్యుత్తు స్తంభాలకు రహదారిపై వెళ్లే భారీవాహనాలు ఢీ కొట్టడంతో ఈ విద్యుత్ స్థంభాలు బలహీనపడ్డాయన్న విమర్శలొస్తున్నాయి.


వీటిని పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేయాల్సిన విద్యుత్ శాఖ అధికారులు తూతూ మంత్రంగా పనులుచేయడంతో ఈ పరిస్థితి దాపురించిందని స్తానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. భారీ వాహనాలకు దెబ్బతిన్నపుడే వాటి స్థానంలో కొత్త  స్థంభాలు బిగించివుంటే ఇలా కూలే పరిస్థితి ఉండేది కాదని వారు పేర్కొంటున్నారు. ప్రతి నెల ప్రజల వద్ద నుండి ముక్కు పిండి విద్యుత్ బిల్లులను వసూలు చేసే విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనమని, స్తంభాలు కింద పడిన సమయంలో ప్రజలు, వాహన ప్రయాణికులు లేకపోవడంతో భారీ ప్రా  ణ నష్టం తప్పిందని ఘటనా స్థలంలో ఉన్న వారు చెబుతున్నారు. స్థంభాలు కూలి అవి  ప్రజలపై గాని వాహనదారులపై గాని పడి ఉంటే భారీ ప్రాణానష్టం జరిగి ఉండేదని వారు పేర్కొంటున్నారు.  ఇద్దంతా విద్యుత్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యవైఖరికి నిదర్శనమని  గ్రామ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: