మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేక చొరవతో ...

తండా రోడ్లకు మహర్దశ.... 9.41 కోట్లు మంజూరు

హర్షం వ్యక్తం చేస్తున్న గిరిజన ప్రజలు,ప్రజాప్రతినిధులు.

బీటీ రోడ్లతో మారనున్న గిరిజన ప్రాంత రూపురేఖలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

నిత్యం జనంలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం పనిచేసే మంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి అని చెప్పవచ్చు. మహేశ్వరం నియోజకవర్గంలో ఏ ఓటరును అడిగిన వారి నుంచి వచ్చే సమాధానమిదే. ఇదిలావుంటే మహేశ్వరం నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల్లో పక్కా రోడ్లను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం  రూ. 9 .41  కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పనులకు త్వరలోనే టెండర్లు పిలిచి ఆరు నెలల్లోగా రోడ్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పెద్దమ్మ తండా  నుండి  కొత్తూరు వరకు బి టి  రోడ్డు నిర్మాణానికి 1 . 50 కోట్లు, చిన్న తుప్రా నుండి పెద్దమ్మ తండా వరకు  బి టి  రోడ్డు నిర్మాణానికి 1 . 98  కోట్లు, ఘట్ పల్లి తండా నుండి దావూద్ గూడా తండా వరకు  బి టి  రోడ్డు నిర్మాణానికి 1 . 80  కోట్లు, నాగారం నుండి పడమటి తండా వరకు రోడ్డు విస్తరణ,  బి టి  రోడ్డు నిర్మాణానికి 1 .12 కోట్లు, మైలార్ భావి తండా నుండి కొత్త తండా వరకు  బి టి  రోడ్డు నిర్మాణానికి 1 . 52  కోట్లు, సర్లరావుల పల్లి నుండి పోథుబండ వరకు  బి టి  రోడ్డు నిర్మాణానికి 1 . 48  కోట్లు మంజూరు చేశామని మంత్రి వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పనులను వెంటనే ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణాలతో గిరిజన ప్రాంతాల రూపు రేఖలు మారనున్నాయని మంత్రి పేర్కొన్నారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: