అభివృద్ధికి ఐకాన్ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 

మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి మంత్రి సబితా ఇంద్రారెడ్డి తోనే సాధ్యం

సీఎంను ఒప్పించి నియోజకవర్గానికి కోట్టాది రూపాయలు తెస్తున్న వైనం

మంత్రి అభివృద్ధి పనులను ప్రశంసిస్తున్న నియోజకవర్గ  ప్రజలు

తాజాగా  అల్మాస్గూడ గ్రామంలోని 5, 6, 24, 25 డివిజన్లో 5 కోట్ల 65 లక్షల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చిన వెంటనే స్పందిస్తూ... ఎప్పటికపుడూ మహేశ్వరం నియోజకవర్గానికి కొత్త ప్రాజెెక్టులు తీసుకొస్తూ అభివృద్ధికి ఐకాన్ గా మారారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఇపుడు ఈ పలుకులే  నియోజకవర్గ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా  మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ అల్మస్ గూడా పరిధిలోని 05,06,24,25  డివిజన్లో ఐదు కోట్ల 26 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి శ్రీకాిరం చుట్టారు. 


 ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బడంగ్పేట్  మున్సిపల్ కార్పొరేషన్లలో ముఖ్యంగా అల్మాస్గూడ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటైన కాలనీలలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో  నివాసం ఉండే ప్రజలు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకొని  ఇక్కడ ఉన్నారని వారికి అన్ని రకాల సురక్షితమైన ప్రాంతం భావించి  ఇక్కడ నివసిస్తున్నారని వారందరికీ కూడా నూతనంగా ఏర్పాటైన కాలనీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా భావించి , పక్కా ప్రణాళిక ద్వారా డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్ల నిర్మాణం ,  రోడ్డు వెడల్పు పనులకు  ఇట్టి నిధులు ఖర్చు చేయడం జరిగిందని ఇట్టి అభివృద్ధిని చూసి మరిన్ని కాలనీ కూడా నూతనంగా ఏర్పాటు అవుతున్నాయని మంత్రి తెలిపారు. 

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మహేశ్వరం  నియోజకవర్గంలోని  అన్ని డివిజన్లో అభివృద్ధి లక్ష్యంగా భావించి  అభివృద్ధి కార్యక్రమాలు  జరుగుతున్నాయని మంత్రి  తెలిపారు. వేసవికాలంలో మంచినీటికి ఎవరు కూడా అధైర్య పడకుండా వారికి కావలసిన మంచినీటి సప్లై ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్రహీం శేఖర్, స్థానిక కార్పొరేటర్లు బోయపల్లి దీపిక శేఖర్ రెడ్డి, రామిడి కవిత రామ్ రెడ్డి, ఏనుగు రామిరెడ్డి, ముత్యాల లలితా కృష్ణ , మరియు ఇతర కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు రామిడి రామిరెడ్డి మరియు నాయకులు మహిళా నాయకురాలు అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: