2కోట్లరూపాయలతో...నూతన 33/11కే వీ సబ్ స్టేషన్ కోసం 

భూమి పూజ చేసిన... నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్రకిషోర్ రెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల పట్టణంలో ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్తు ఉండేందుకు నంద్యాలకు అదనపు విద్యుత్ సబ్ స్టేషన్ నూతన నిర్మాణ కార్యక్రమాన్ని ప్రధమనంది దేవస్థానం దగ్గర పవర్ సబ్ స్టేషన్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి మరియు విద్యుత్ శాఖా అధికారులు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ...2 నెలలోపు పనులు పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు.నూతన సబ్ స్టేషన్ వల్ల బొమ్మలసత్రం, పద్మావతినగర్,మున్సిపల్ ఆఫీస్,పెద్దబండ ప్రాంతాల లోని ప్రజలకు విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఆటంకం కలవకుండా విద్యుత్ సరఫరా అవుతుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: