హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా...
సరాబు లక్ష్మణ్ గుప్త ఎన్నిక
(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)
హైదరాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ 22 వ అధ్యక్షుని గా సరబు లక్ష్మణ్ గుప్త ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం నాడు కాచిగూడ వైశ్య హాస్టల్ నందు జరిగిన సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఎన్నికల అధికారిగా అర్థం లక్ష్మయ్య గుప్త విచ్చేసి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రధాన కార్యదర్శి గా కటకం శివకుమార్, కోశాధికారిగా లింగ ప్రకాష్ , అదనపు ప్రధాన కార్యదర్శి కోకొల్ల సత్యం గుప్త, ఉపాధ్యక్షులు అడ్మిన్ రేపాక వెంకటేశ్వర్లు, పి ఆర్వో గా దేవత శ్రీనివాస్ గుప్త, సహాయ కోశాధికారి చింతలఘట్ శ్రీరామ్, వాసవి సేవదల్ అధ్యక్షులు గా కూన వెంకట గోపాల కృష్ణ ,
మహిళ విబాగ్ అధ్యక్షురాలు గా కొమిరిశెటీ స్వర్ణలత, గర్లను నూతన అధ్యక్షులు నియమించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు మ్యాడం దయాకర్ గుప్త, మాజీ అధ్యక్షులు రెడ్డిశెట్టి చంద్రశేఖర్ రావు , అల్లాడి నాగభూషణం, కాశెట్టి పాండు గుప్త, కసనగొట్టు రాజశేఖర్ గుప్త, కే. మల్లికార్జున్ గుప్త, కూర జయరాములు గుప్త, ఎమ్మెల్సీ భోగారపు దయానంద గుప్త, వేలూరు రవీంద్ర నాథ్ గుప్త, తదితరులు పాల్గొన్నారు... హైదరాబాద్ జిల్లాలో గలా 36 బస్తీ సంఘాల ప్రతినిధులు సుమారు 300 మంది పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: