నూతన బంజారా భవన నిర్మాణాల కోసం

రూ. 2 కోట్లు చొప్పున మంజూరు

మంత్రి సబితా ఇంధ్రారెడ్డి వెల్లడి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఆదివాసీ గిరిజనుల ఆత్మ గౌరవం ఉట్టిపడేలా రంగారెడ్డి జిల్లాలోని ఆమన్ గల్, మహేశ్వరం, షాద్ నగర్ లలో  నూతన బంజారా భవనాల నిర్మాణాలకు రూ. 2  కోట్లు చొప్పున మంజూరు చేశామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆదివాసీ గిరిజనులు తమ సంస్కృతిని ప్రదర్శించేందుకు, సభలు, సమావేశాలు, సమ్మేళనాలు నిర్వహించేందుకు ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేయాలనీ నిర్ణయించిందని మంత్రి తెలిపారు. గతంలో స్థానిక గిరిజనులు కోరిన కోరికపై వీటిని మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పనులను త్వరలోనే  ప్రారంభిస్తామని  మంత్రి వెల్లడించారు. ఆదివాసీల, గిరిజన సంస్కృతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, అందులో భాగంగానే ఈ నిధుల మంజూరు అని తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: