శ్రీ రేణుక ఎలమ్మ తల్లి దేవాలయ పున ప్రతిష్టాపన,,,, శ్రీ మల్లికార్జున స్వామి వార్ల ఆలయానికి

 విరాళంగా రూ.1,12,149  అందజేసిన బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

అభినందనలు తెలుపుతూ బుక్క వేణుగోపాల్ కు ఆలయకమిటీ సన్మానం

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

వ్యక్తుల  పట్ల ఉదారత...ఆలయాలకు వితరణ అందించడం బీజేపీ రాష్ట్ర నాయకులు  బుక్క వేణుగోపాల్  ప్రత్యేకత. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో "శ్రీ రేణుక ఎలమ్మ తల్లి దేవాలయ పున ప్రతిష్టాపన, శ్రీ మల్లికార్జున స్వామి వార్ల ఆలయ ముఖ ద్వార" నిర్మాణమునకు ₹1,12,149 రూపాయల విరాళాన్ని బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ అందజేశారు.


దీంతో బుక్క వేణుగోపాల్ కు అభినందనలు తెలుపుతూ ఆలయ కమిటీ సభ్యులు జ్ఞాపికతో సత్కరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నానావల్ల కుమార్ యాదవ్, పిల్లోనిగోవేల నగేష్ యాదవ్, వెంకయ్య యాదవ్ మేండే కుమార్ యాదవ్, పిల్లోనిగోవేల కిరణ్ యాదవ్, కిషోర్ యాదవ్, బిజెపి నాయకులు కనకమామిడి కిట్టు, బంగారం కుమార్, నడ్డిగడ్డ మోహన్ రావు, మల్చలం మహేష్ తదితరులు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: