గడివేముల "ఇండియన్1" ఏటీఎంలో డబ్బులు డ్రాచేసి 

లబోదిబో అంటున్న బాధితులు

రూ 4వేలు డ్రా చేయగా. వచ్చింది రూ.3800/-

మరో మారు రూ.4 వేలు డ్రా చేస్తే వచ్చింది రూ.100

మాకు జరిగిన నష్టం భర్తీ చేసేది ఎవరు... ఏటీఎం బాధితుల ప్రశ్న

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

మన దేశవ్యాప్తంగా ఏటీఎంలో వచ్చాక డబ్బులు డ్రా చేయడం చాలా సులువుగా మారింది. కానీ డివేములలోని ఏటీఎం కస్టమర్లకు మాత్రం అదే శాపంగా మారింది. దీనికి కారణం"ఇండియన్1" ఏటీఎంలో డ్రా చేసిన మొత్తానికి తక్కువగా చాలా తక్కువగా డబ్బులు రావడం.. కొన్ని సందర్భాలలో డబ్బులు రాకపోగా మనీ డ్రా చేసినట్టు రిసిప్ట్ రావడం... అక్కడి ఏటీఎం బాధితులు వాపోతున్నారు... వివరాలలోకి వెళితే... నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక గడివేములలో ఉండే ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వారు మంజూరు చేసిన ఏటీఎం కార్డు నుండి అక్కడే స్థానికంగా ఉన్న ఇండియన్1 ఏటీఎం నుండి ఓ వ్యక్తి మార్చి 20 తేదీన 4000/- రూపాయలను డ్రా చేయగా 3800/- వచ్చాయని, మరల 4000/- డ్రా చేయగా కేవలం 100/- రూపాయలు వచ్చిందని,


మరల 500/- డ్రా చేయగా ఏటీఎం నుండి ఎలాంటి డబ్బులు రాలేదని ఓ వ్యక్తి వాపోయాడు. ఈ విషయాన్ని గ్రామీణ ఆంధ్ర ప్రగతి బ్యాంక్ మేనేజర్ కి తెలియజేసి వారి వద్దనుండి స్టేట్మెంట్ తీసుకున్నామని, కస్టమర్ కేర్ కు ఫిర్యాదు చేయగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వారి నుండి కేవలం1500/- అకౌంట్లో జమ అయ్యాయని తెలిపాడు.

ఇండియన్1 బ్యాంకు వారి వద్ద నుండి ఎలాంటి సమాచారం, స్పందన అందడం లేదని బాధితుడు వాపోయాడు. గడివేముల మండలంలో సోలార్, జిందాల్ కంపెనీలలో పనిచేసేవారు ఇండియన్1 ఏటీఎంలో డబ్బులను డ్రా చేసుకోవడానికి వచ్చి డ్రా చేసిన తర్వాత డబ్బులు రాకపోగా, డబ్బులు తీసుకున్నట్లు స్టేట్మెంట్ రిసిప్ట్ మాత్రం వస్తుందని బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ వాపోతున్నారు. దీంతో ఏటీఎంలో డబ్బులు రాక ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక ప్రజలు నిరాశతో వెళ్తున్నారు.


దీంతో డబ్బులు ఎవరూ డ్రా చేయొద్దని ఏటీఎం బాధితులు వాపోతున్నారు. దీనిపై అధికార యంత్రాంగం దృష్టి సారించి ఈ లోపాన్ని సరిచేయాలని కూడా ప్రజలు విన్నవించుకుంటున్నారు. ఏటీఎంలో ఇలా జరుగుతున్న ఇబ్బందులు దేని కారణంగా అన్న విషయాన్ని పరిశీలించి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: