ఏప్రిల్ 2023

 అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదు

చార్మినార్ ఏసిపి రుద్ర భాస్కర్

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని చార్మినార్ ఏసిపి రుద్ర భాస్కర్ కోరారు శనివారం కామాటిపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ తేజావత్ కొమరయ్యతో కలిసి రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని  అసాంఘిక కార్యకలాపాలు . దౌర్జన్యాలకు కానీ పాల్పడితే సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇకపై రౌడీ షీటర్ల పై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.


 కుల వృత్తులకు కేసిఆర్ పెద్దపీట వేశారు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

కుమ్మర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో.

ముఖ్య అతిధిగా పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

 మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని  కందుకూరు మండల కేంద్రంలోని  సామ నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహేశ్వరం నియోజకవర్గం స్థాయి  కుమ్మర ఆత్మీయ సమ్మేళన  కార్యక్రమమానికి విద్యా శాఖ మంత్రి  పి సబితా ఇంద్రారెడ్డి  ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కుమ్మర ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన   మంత్రికి కుమ్మర కుటుంబ సభ్యులు ఆత్మీయ  స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పాత కాలంనుండి నేటి వరకు కుమ్మర వృత్తి చాలా ప్రాధాన్యత సంతరించుకుందని అని అన్నారు. సమైఖ్య రాష్ట్రంలో ఆదరణకు దూరంగా ఉన్న కులాలకు ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రత్యేకంగా గుర్తించి కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.  సామాజికంగా ఆర్థికంగా బల పడేలా కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారని తెలిపారు.


ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, జడ్పీటీసీ జంగారెడ్డి, మహేశ్వరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ సిలివేరి సాంబశివ, స్థానిక ప్రజాప్రతినిధులు, కుమ్మర సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

 బిజెపి బూత్ స్వశక్తికరన్ సమావేశానికి...

హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

రాజేంద్రనగర్ అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ యాదవ్ గారి అధ్యక్షతన రాయల్ ప్యాలస్ హోటల్ లో జరిగిన రాజేంద్రనగర్ నియోజకవర్గ బూత్ స్వశక్తికరన్ సమావేశానికి బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అథితిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి బంగారు శృతి, రంగారెడ్డి జిల్లా రూరల్ అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, అర్బన్ అధ్యక్షులు సామ రంగారెడ్డి, అసెంబ్లీ కో- కన్వీనర్ మహాలింగం గౌడ్, చేవెళ్ల పార్లిమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, రంగారెడ్డి


జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్, జిల్లా కార్యదర్శి మొండ్ర కొమరయ్య, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు బైతి శ్రీధర్, కార్పొరేటర్లు సంగీత గౌరీ శంకర్, తోకల శ్రీనివాస్ రెడ్డి, బుర్ర భూపాల్ గౌడ్, ప్రశాంత్ నాయక్, రంగారెడ్డి జిల్లా ఓబీసీ కార్యదర్శి నాన్నవాళ్ళ కుమార్ యాదవ్, శంషాబాద్ మండల బీజేవైఎం అధ్యక్షులు బుక్క ప్రవీణ్ కుమార్, మండల-డివిజన్ అధ్యక్షులు, నియోజకవర్గ బిజెపి బూత్ అధ్యక్షులు, ఇంచార్జిలు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్యాక్స్ ల విషయంలో అపోహలు వద్దు

నాటి టాక్స్ లే చెల్లించవచ్చు

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశానికి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి,కార్పొరేటర్లు, కమిషనర్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నుండి మునిసిపల్ గా మారినపుడు ఉన్న టాక్స్ లే వసూలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని పేర్కొన్నారు. మీర్ పేట్ కార్పొరేషన్ ప్రజల తరుపున ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అపోహలకు తావులేకుండా పాత టాక్స్ నే చెల్లించాలన్నారు.ఈ సందర్భంగా ఎజెండా అంశాలపై చర్చించి ఆమోదించారు.
 బిఆర్ఎస్ తోనే నియోజకవర్గ అభివృద్ధి

సబితమ్మ కు మద్దతుగా బిఆర్ఎస్ లో చేరిన యువత

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహేశ్వరం లోని బిఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు సాగుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గం ఎన్ డి తండా గ్రామానికి  చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు, కార్యకర్తలు ఆయా పార్టీలకు మూకుమ్మడిగా రాజీనామా చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి మంత్రి బి ఆర్ ఎస్ లోకి ఆహ్వానించారు. పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతా లకు...

ఆధార్ అనుసంధానం చేసుకోవాలి

బహదూర్పురా మండల తహసీల్దార్ జుబేదా బేగం

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

మండల పరిధిలోని వితంతు, వికలాంగ, వృద్ధాప్య పెన్షనర్లు తమ బ్యాంకు ఖాతా లకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని బహదూర్పురా మండల తహసీల్దార్ జుబేదా బేగం సూచించారు. ముఖ్యంగా చందులాల్ బారాదరి (19-2 వార్డు) నూర్ ఖాన్ బజార్ (22వ వార్డు)కు చెందిన లబ్ధిదారులు వెంటనే తమ ఖాతా ఉన్న బ్యాంకుక్కు వెళ్లి ఆధార్ అనుసంధానం చేయించుకోవాలని, మండల కార్యాలయా నికి రావాల్సిన అవసరం లేదన్నారు. అను సంధానం చేయించుకోకుంటే వారికి పెన న్ ఆగిపోతుందని తహసీల్దార్ తెలిపారు

 మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన..

ఘనంగా మహేశ్వరం నియోజకవర్గ ప్లీనరీ...

వెలదిగా తరలి వచ్చిన బి అర్ ఎస్ శ్రేణులు

కెసిఆర్ పథకాలతో యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తోంది

నినాదించిన బీఆర్ఎస్ నేతలు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన మహేశ్వరం నియోజకవర్గ బిఅర్ఎస్ కార్యకర్తల ప్లీనరీ సమావేశం విజయవంతంగా కొనసాగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం  సుల్తాన్ పూర్ సమీపంలో  మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల  ప్లినరి సమావేశం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగింది. ఈ సమావేశానికి పార్టీ  నేతలు, కార్యకర్తలు  నియోజకవర్గ  ప్రాంతాల నుండి  భారీ ర్యాలీలతో   సభస్థలికి తరలివచ్చారు.


ముందుగా సభ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండా ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిది సంవత్సరాలలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పలు తీర్మానాలు చేశారు.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయ రంగం, సామాజిక భద్రత, మహిళ శ్రేయస్సు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, దళితబందు, విద్యుత్ రంగం, విద్యా, వైద్య రంగం, బీసీ, మైనార్టీ సంక్షేమం, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, నియోజకవర్గ అభివృద్ధితోపాటు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల పై ఈ ప్రతినిధుల సమావేశంలో తీర్మానాలు


చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై తీర్మానాలు చేసారు. పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేసారు. సీఎం  కేసీఆర్  తీసుకొచ్చిన విధానాలతో దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందన్నారు.. దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి గుణాత్మకమైన పాలనను అందించడం కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు... ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనిత రెడ్డి, మాజీ మేయర్ కృష్ణారెడ్డి, యువ నేత కౌశిక్ రెడ్డి, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


 రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి...మరొకరికి గాయాలు

(జానో జాగో వెబ్  న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా మహానంది మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా మరో వ్యక్తి గాయ పడ్డారు. నంద్యాల మహానంది రహదారిలోనీ బొల్లవరం,సుగాలిమిట్ట రహదారి మధ్యలో మహానంది మండలం బొల్లవరం గ్రామానికి చెందిన జగడం సురేష్, తమ్మడపల్లె గ్రామానికి చెందిన డక్క ముని అనే ఇద్దరు మోటార్ సైకిల్ పై నంద్యాలకు పోవుచుండగా నంద్యాల వైపు నుండి వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో జగడం సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా గాయపడ్డ ముని ని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అతనికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు.
 పంచాయతీలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం

గడివేముల ఎంపీడీవో శివ మల్లేశ్వరప్ప

(జానో జాగో వెబ్  న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లా గడివేముల మండల పరిధిలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయం నందు శివ మల్లేశ్వరప్ప ఆధ్వర్యంలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మండల స్థాయిలో దారిద్ర నిర్మూలన కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన కొరటమద్ది, కే.బొల్లవరం,ఓందుట్ల పంచాయతీలకు ప్రశంశా పత్రాలను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచులు,ఎంపీటీసీలు మరియు పంచాయతీ కార్యదర్శిల సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో స్వయం పరిపాలనతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళితే అభివృద్ధి సాధ్యమవుతుందని, మండల అభివృద్ధి అధికారి శివ మల్లేశ్వరప్ప తెలిపారు. గడివేముల జడ్పిటిసి ఆర్బి.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల పటిష్ట పరిచేందుకు సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చిందని,


గతంలో పంచాయతీ స్థాయిలో వీఆర్వో మరియు కార్యదర్శి మాత్రమే అందుబాటులో ఉండే వారిని ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ వల్ల గ్రామస్థాయిలో వివిధ శాఖల్లో అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని,గ్రామాల అభివృద్ధి చెందితేనే మండల అభివృద్ధి జరుగుతుందని,ప్రతి పంచాయతీని అభివృద్ధి బాటలో నడిపించేందుకు సర్పంచులు మరియు కార్యదర్శులు సమన్వయంతో పనిచేయాలని సూచించిన అనంతరం సర్పంచ్లకు, కార్యదర్శిలకు, ఎంపీటీసీలకు ప్రశంశా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు,పంచాయతీ కార్యదర్శులు,ఆర్బికె చైర్మన్ పుల్లయ్య, వైస్ ఎంపీపీ కాలు నాయక్ పాల్గొన్నారు.

 జీవోోలతో సహా నిధుల వివరాలు వెల్లడించి

బీజేపీ నేతలకు  పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కౌంటర్

నిధులు తెచ్చినట్లు ఇచ్చిన జీవోలు చూడండి

యూపీ,గుజరాత్ లాంటి ట్రబుల్ ఇంజన్ సర్కార్ కాదిక్కడా....కేసీఆర్ ప్రజా సర్కార్ వుంది

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులేమిటీ అని ప్రశ్నించిన బీజేపీ నేతలకు బీఆర్ఎస్ యువనేత,  జాతీయ మీడియా స్పోక్స్ పర్సన్ పట్లోళ్ళ కార్తీక్ రెడ్డి తనదైన శైలీలో కౌంటర్ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులేమిటో తెలియజేస్తూ వాటి నిధుల మంజూరుకు జారీచేసిన జీవోలను విడుదల చేసి బీజేపీ నేతల  నోళ్లను మూయించే  ప్రయత్నం చేశారు.  కార్తీక్ రెడ్డి.  సోమవారంనాడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విగో మంత్రి తెచ్చిన నిధులు....జీవో లు చూసైనా తెలుసుకో అంటూ బీజేపీ  నేతలకు సవాల్ విసిరారు. జీవో కాపీలను మీడియా సమావేశంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  1300 కోట్లతో మహేశ్వరం నియోజకవర్గ అభివృద్ధిచేశాం.  ఇవన్నీ మండల, జిల్లా పరిషత్,మునిసిపల్, సిడిపి,  డీఎంఎఫ్టీతో పాటు రెగులర్ గా వచ్చే ఎలాంటి నిధులు కాదు..ఇవి కేవలం మంత్రి ప్రత్యేకంగా కృషి  తెచ్చిన ప్రత్యేక నిధులు మాత్రమే. మీ యూపీ,గుజరాత్ లాంటి ట్రబుల్ ఇంజన్ సర్కార్ కాదిక్కడా  ఉన్నది....కేసీఆర్ ప్రజా సర్కార్.  అవగాహన లేకుండా మట్లోడొద్దు. మూడు కోట్లు, ఆరు కోట్లు అంటూ ఏ నిధులో తెలువకుండా మట్లోడొద్దు....మళ్ళీ ఆర్ టి ఐ అవసరం లేకుండా చూసుకోవటానికి జి ఓ కాపీల పి డి ఎఫ్ ని పంపుతున్న చూసుకో....ఇందులో ఏ తప్పులున్న మళ్ళీ నియోజకవర్గ రాజకీయాల జోలికి రాను.


 
మీ లాగా సగం వ్యాపారం సగం రాజకీయం కాదు....సబితమ్మ 24 గంటలు పనిచేసేది ప్రజల కోసమే...మహేశ్వరం అభివృద్ధి కోసమే అని గ్రహించాలి.  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నయా పైసా ఇవ్వకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో మహేశ్వరం నియోజకవర్గాన్ని ఉహాలకందని విధంగా అభివృద్ధి చేసిన ఘనత మంత్రి సబితా ఇంద్రారెడ్డిది. ప్రజల్లో తిరిగితే సమస్యలు తెలుస్తాయి,పరిష్కారం చేసే వీలుంటుంది.... మీరు చేసేది ఎన్నికల రాజకీయం.  నియోజకవర్గములో విద్యాలయాల బాగు కోసమే 80 కోట్ల నిధులతో పనులు చేప్టటాం. రూ184 కోట్ల హెచ్ఎండీఏ నిధులతో బడాంగ్ పేట్,మీర్ పేట్,జల్ పల్లి,తుక్కుగూడ లలో రోడ్లు,సెంట్రల్ లైటింగ్,చెరువుల అభివృద్ధికి నిధులు తెచ్చి పనులు మంత్రి చేయిస్తున్నారు.  ఆర్ అండ్ బి నుండి 432 కోట్లు తెచ్చి రోడ్ల బాగు కోసం ముందున్న మంత్రి. టీఎస్ఐఐసీ ద్వారా 14 కోట్ల 66 లక్షలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయటం జరిగింది. హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ నుండి  ప్రతి ఇంటికి నల్లాల ద్వారా నీరు అందించే కార్యక్రమంలో భాగంగా 331 కోట్ల పై చిలుకు నిధులతో పనులు జరుగుతున్నాయి. టీయూఎఫ్ఐడీసీ ద్వారా 13 కోట్ల 86 లక్షల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.  మహేశ్వరం ఆస్పత్రి ఆప్ గ్రేడ్ కోసం 5 కోట్లు మంజూరు చేయించి,పనులు కోసాగుతున్నాయి.  పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 165 కోట్లతో అభివృద్ధి పనులు. ఎస్ఎన్డీపీ ద్వారా 92 కోట్ల నిధులతో నాళాలు,ట్రంక్ లైన్ల నిర్మాణాల పనులు,వానొస్తే తగ్గిన వరద ముంపు, భవిష్యత్తు లో పూర్తి సమస్య పరిష్కారం చూపాం. అని పట్లోళ్ల కార్తీక్ రెడ్డి వెల్లడించారు.