భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యత

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపు


 
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవడం మనందరి బాధ్యత అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా శుక్రవారంనాడు జలమండలి, గాంధీ జ్ఞానం ప్రతిష్టాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమములో పాల్గొని  మంత్రి. పి. సబితా ఇంద్రారెడ్డి కరపత్రాలను విడుదల చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ భూగర్భ జలాలను అభివృద్ధి చేసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ.  కేసీఆర్ గారు రాష్ట్రమంతా నీటి కొరకు ప్రాజెక్టులు నిర్మించడం, నదులను, కుంటలను మిషన్ కాకతీయ ద్వారా పూడికలు తీయించడం వల్ల గతంలో కంటే భూగర్భ జలాలు పెరిగాయని అన్నారు. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని రానున్న వర్షాకాలంలో వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా జల నిధిగా మార్చుకొని భూగర్భజలాల నిల్వలు  పెంపొందే విధంగా కృషి చేయాలి అన్నారు.


త్రాగునీటికి, సాగునీటికి... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నో వందల కిలో మీటర్ల దూరం నుండి నగరానికి ఉచితంగా నీరు అందిస్తుందని  అట్టి నీటిని వృధా చేయకూడదని కోరారు.   ప్రతి విద్యా సంస్థలో ఇంకుడుగుంతల నిర్మాణాలకు,ప్రతి విద్యార్థి భాగస్వామిని చేసే విదంగా వారికి ప్రాజెక్టు కృత్యంగా చేయనున్నట్టు తెలిపారు.

ముఖ్యంగా జలమండలి అధికారులతో కలసి స్వచ్ఛంద సంస్థ  ...ప్రజలకు,విద్యార్థులకు అనేక అవగాహన కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్న గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్  డాక్టర్ గున్నా రాజేందర్ రెడ్డి మరియు వారి ప్రతినిధులు యానాల ప్రభాకర్ రెడ్డి, పొట్లపల్లి గిరిధర్ గౌడ్ గార్లను అభినందించారు.  ఈ కార్యక్రమంలో  కోఆర్డినేటర్లు వి. నరేష్, ఎన్. ప్రుద్వి, కె. శ్రీకాంత్,డి. శివ కిషోర్ రెడ్డి, ఎస్.శివ , వి. విజయ్ గౌడ్ మరియు మధు పాల్గొన్నారు.
 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: