ప్రతి ఒక్కరూ సీపీఆర్ విధానంపై అవగాహన కలిగివుండాలి
సిపిఆర్ ద్వారా గుండెపోటుకు గురైన వారిని రక్షించవచ్చ
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)
ఆకస్మికంగా గుండెపోటుతో చనిపోతున్నవారిని సిపిఆర్ నిర్వహించడం ద్వారా వారి ప్రాణాలను రక్షించవచ్చని తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని మంత్రి సూచించారు. శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ సిబ్బందికి శిక్షణలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి రాష్ట్ర విద్య శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీవనశైలి ఆహారపు అలవాట్లు మారడంతో ప్రపంచవ్యాప్తంగా సడన్ కార్డియాక్ అరెస్టులు ఆకస్మిక గుండెపోటులు పెరిగాయని, గుండెపోటుకు గురైన వారికి వెంటనే కారియో పల్మనరీ రీససిటేషన్ సిపిఆర్ చేయగలిగితే ప్రాణాపాయం తప్పే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కరోనా తరువాత చిన్న వయసు వారికి కూడా గుండెపోటు వస్తున్నాయని, గుండెపోటు వచ్చిన వారికి వైద్యుని కొరకు వేచి చూడకుండా వెంటనే సిపిఆర్ నిర్వహించడం ద్వారా మరణాలు తగ్గించవచ్చని అన్నారు. ప్రాణానికి మించి ఏది లేదని, మన చుట్టుప్రక్కల వారు ఆకస్మికంగా గుండెపోటుతో కుప్పకూలిపోతే వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారమిస్తూ,
వాహనం వచ్చే పది నిముషాల వరకు సిపిఆర్ చేస్తూ, ఊపిరి అందిస్తే ఒక నిండు జీవితాన్నీ, కుటుంబాన్ని కాపాడగలిగిన వారమవుతామని అన్నారు. గుండె పోటు వచ్చిన వ్యక్తికి తక్షణ ప్రథమ చికిత్స అందించడం వలన ప్రాణాలను కాపాడొచ్చని సిపిఆర్ పై అవగాహన ఉండడం ద్వారా మానవతా దృక్పధంతో సకాలంలో స్పందించి సిపిఆర్ నిర్వహించి విలువైన ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ఆ దిశగా శిక్షణ పొందిన ట్రైనర్లతో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, వారు తిరిగి ఇతరులకు శిక్షణ ఇస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వాసుపత్రులల్లో పుట్టబోయే బిడ్డను నుండి అన్ని రకాల వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నదని అన్నారు. ఆరోగ్యమే మాహాభాగ్యం అంటే సమాజానికి ఆరోగ్యకరమైన మానవ వనరులను అందించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని అన్నారు.
గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సర్వసభ్య సమావేశాల ద్వారా, అంగన్ వాడిల ద్వారా, మహిళా సమాఖ్య సంఘాల ద్వారా ప్రజలకు సీపీఆర్ పై అవగాహన కల్పించాలని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ప్రజలకు కంటివెలుగు కార్యక్రమం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి కళ్లద్దాలను అందిస్తున్నారని, పట్టణాలలో బస్తి దవాఖానాలు, పల్లెలో పల్లె దవాఖానాలు, వంద పడకల ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యాన్ని, ఇంటికి ఇంటికి వెళ్ళి బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి మందులు అందించడం జరుగుతున్నదని మంత్రి తెలిపారు. అనంతరం ప్రపంచ క్షయ వ్యాధి నిర్మూలన దినోత్సవ సందర్భంగా పోస్టర్ ను విడుదల చేశారు.ఎన్.సి.డి. కిట్లు అందజేశారు.
జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ ఇటీవల వయస్సుతో నిమిత్తం లేకుండా చాలా మంది గుండెపోటుతో చనిపోతున్నారని, వారికి సకాలంలో సిపిఆర్ నిర్వహించడం ద్వారా ప్రాణాలను రక్షించవచ్చని అన్నారు. సిపిఆర్ అంటే ప్రజలలో చాలా మందికి అవగాహన వచ్చిందని, కానీ ఎలా చేయాలో తెలియదని ఆకస్మికంగా కుప్పకూలిన వ్యక్తిని పలకరించి, నాడి, ఊపిరి తీసుకుంటున్నారో పరిశీలించాలని, గుండె పోటు అని నిర్దారణకు వచ్చిన వెంటనే
108 అంబులెన్స్ కు ఫోన్ చేస్తూ ఒక నిముషంలో 100 నుండి 120 సార్లు గుండెపై రెండు చేతులతో పుష్ అప్ చేస్తూ మధ్య మధ్య ఊపిరి అందిస్తుండాలని, ఏ.ఈ.డి.యంత్రం ద్వారా షాక్ ఇవ్వాలని అన్నారు. ఇటీవల హైదరాబాద్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ సిపిఆర్ నిర్వహించడం ద్వారా ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడారని, ఆ స్ఫూర్తితో ఫ్రంట్ లైనర్స్ కు శిక్షణ ఇవ్వడం ద్వారా కొందరి ప్రాణాలైనా కాపాడవచ్చనే ఉద్దేశంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. జిల్లాలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనీ బృందాలతో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సిపిఆర్ నిర్వహించే ముందు ఆ వ్యక్తి నిజంగా గుండెపోటుకు గురయ్యారా లేదా అని గుర్తించాలని సూచించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరనాథ్ రెడ్డి, శాసన సభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్, ఎమ్యెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్ రావు, వైద్యాధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ప్రతి ఒక్కరూ సీపీఆర్ విధానంపై అవగాహన కలిగివుండాలి,,,, సిపిఆర్ ద్వారా గుండెపోటుకు గురైన వారిని రక్షించవచ్చ,,,, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: