మా ఇంటిపక్కన పెద్ద నలా...దాని పక్కన చిన్న రైల్వే స్టేషన్

ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన పాతబస్తీ బాలుడి చిరునామా ఇదే

తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నంలో సౌత్ జోన్ డీసీపీ కార్యాలయం

సహకరిస్తే ఓ కుటుంభాన్ని ఆదుకోవచ్చు

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

ఎనిమిదేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపో యిన బాలుడు లక్నోలోని ఓ ప్రభుత్వ చి ల్డ్రన్ హోమ్ ఆశ్రయం పొందుతున్న ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. వివరాలలోకి వెళితే పాతబస్తీకి చెందిన ఫయాజ్ అనే బాలు డు 8 ఏళ్ల క్రితం తప్పిపోయాడు. అప్పట్లో రైలు ఎక్కి లక్నోకు వెళ్లిన ఫయాజ్ ను రైల్వే పోలీసులు ఓ అనాథాశ్ర మంలో చేర్పించారు. ఫయాజ్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లక్నోలోని మోహన్ రోడ్డు సమీపంలోని ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్లోనే ఉన్నాడు. నీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడ ఉంటా వు? అని ఫయాజ్ ను చిల్డ్రన్ హోంలో సైకలాజిస్ట్ అడిగి న ప్రశ్నలకు తనకు గుర్తు ఉన్న కొన్ని అం శాలను వెల్లడించాడు. తన తండ్రి పేరు హాషం బైమా, తల్లి సురయ్యా బేగంగా చెప్పాడు. తన తండ్రికి సెల్ ఫోన్ రిపేర్ షాపు ఉందని, తన ఇల్లు పాతబస్తీలోని ఓ పెద్ద నాలా పక్కన ఓ చిన్న రైల్వేస్టేషన్ కూడా ఉందని. ఫయాజ్ పేర్కొన్నాడు. దీంతో సదరు సైకలాజిస్ట్ ఫయాజ్ చెప్పిన ఆధారాల ప్రకారం హైదరా బాద్ పాతబస్తీ వాస్తవ్యుడై ఉండొచ్చని చెప్పారు. దీంతో లక్నోలోని చిల్డ్రన్ హోం వారు హైదరాబాద్ లోని సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంను సంప్రదించి వివరాలు పంపారు. ఈ బాలుడి తల్లిదండ్రుల చిరునామ తెలి స్తే లక్నో మోహన్ రోడ్డులోని ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్ కు సంప్రదించాలని కోరినట్లు సౌత్ జోన్ డీసీపీ కార్యాలయం వెల్లడించింది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: