అభివృద్ధి పనులను వేగవంతం చేయండి

అధికారులను ఆదేశించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

బడంగ్పేట్, మీర్పేట్ కార్పొరేషన్ల పరిధిలో పనులను వేగవంతం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఆదేశించారు. ఆయా కార్పొరేషన్ల అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సోమవారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగ్ పనులను నెల రోజుల లోపు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.వివిధ పనులకు సంబంధించి రోడ్ల ప్రక్కన తవ్వి పూడ్చకుండా వదిలేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


పనుల నాణ్యతలో రాజీపడవద్దని, ప్రజాప్రతినిధులు కూడా వాటిని తనిఖీ చేయాలన్నారు.ప్రతి పనికి సంభందించి ఒక నిర్ణిత గడువు  పెట్టుకొని పూర్తి చేయాలన్నారు. ఆయా డివిజన్లలో చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయా కార్పొరేషన్లలో 13 కోట్ల 80 లక్షలు బీటీ రోడ్ల పనులకు మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో మీర్పేట్ మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్,బడంగ్పేట్ డిప్యూటీ మేయర్ ఇబ్రహం శేఖర్ , మునిసిపల్ కమిషనర్లు,కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.







Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: