అకాల వర్షాలతో...పంట నష్టం

పంట నష్టాన్ని అంచనా వేసేందుకు సహచర మంత్రులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

వికారాబాద్ జిల్లాలో పంట పొలాలను పరిశీలించిన మంత్రులు

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో అకాల వర్షం కారణంగా పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తన సహచర మంత్రులతో కలిసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. అకాలవర్షం, వడగళ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించడానికి బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితరులతో కలిసి విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు.


అనంతరం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం మర్పల్లి తాండ లో అకాల వర్షానికి  దెబ్బతిన్న పంటలను మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి పరిశీలించారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: