మార్చి 6న లలితా కళా తోరణంలో... 

సెట్విన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

సెట్విన్ ఎం.డీ.వేణుగోపాల్ వెల్లడి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ సెట్విన్ ఆధ్వర్యంలో మార్చి 6వ తేదీన హైదరాబాద్ లోని పబ్లిక్ గార్డెన్ లో గల లలితా కళాతోరణంలో మహిళా దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె.వేణఉగోపాలరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 3వ తేదీన బ్యూటీషియన్, మార్చి 4వ తేదీన ఫ్యాషన్ డిజైనింగ్ అంశాలలో సెట్విన్ కేంద్రాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థినీలకు పోటీలు నిర్వహించనున్నట్లు ఆ‍యన తెలిపారు. శిక్షణ కేంద్రాలలో మొదటి స్థానంలో నిలిచిన వారు మాత్రమే ఈ పోటీల్లో పాల్గొనేందుకు అవకాశముంటుందన్నారు. బ్లౌస్ డిజైనింగ్,  డ్రస్ మేకింగ్, జర్దోజీ, బ్రైడల్ మేకప్, హేయిర్ స్టయిల్, మెహందీ డిజైనింగ్ లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని పబ్లిక్ గార్డెన్ లోని లలితా కళాతోరణంలో జరిగే మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిధుల చేతుల మీదగా బహుమతులు అందజేస్తామని ఆయన వెల్లడించారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: