హెచ్ యూజే డైరీ-2023ని ఆవిష్కరించిన,,,

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

(జానో జాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ ప్రతినిధి)

టియూడబ్ల్యూజే అనుబంధ విభాగం హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్ (హెచ్ యూజే)  డైరీ-2023ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించారు. శుక్రవారంనాడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాసంలో  జరిగిన ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో హెచ్ యూజే ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ డైరీ యోక్క ప్రత్యేకతను హెచ్ యూజే కోశాధికారి కల్పగూరి శ్రావణ్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సయ్యద్ ఇబ్రాహీం అలీ ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వివరించారు.


ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమన్నారు. జర్నలిస్టులు లేకపోతే ప్రజాస్వామ్య మనుగడ అసాధ్యమని, అందుకే మీడియాను ఫోర్త్ ఎస్టేట్ గా పిలుస్తారని ఆమె పేర్కొన్నారు. జర్నలిస్టులు నిత్యం శ్రమటోర్చి వార్తలను సేకరించి అందించే సేవలు ఎనలేనివి అనిా ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పాతనగర జర్నలిస్టుల సంఘం ప్రతినిధి నారా భుజంగరావు తదితరలు పాల్గొన్నారు. Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: