మోడీ సర్కార్  పెంచిన రూ 17 భారమా... కెసిఆర్ పెంచిన విద్యుత్.. బస్సు చార్జీల పెంపు భారమా

కెసిఆర్... టిఆర్ఎస్ పార్టీ నాయకులకు బుక్క వేణుగోపాల్ సూటి ప్రశ్న

(జానో జాగో వెబ్ న్యూస్-రాజేంద్రనగర్ ప్రతినిధి)

మోడీ సర్కార్ గ్యాస్ సిలిండర్ పై  పెంచిన రూ 17 భారమా... కెసిఆర్ పెంచిన విద్యుత్.. బస్సు చార్జీల పెంపు భారమా అని బిజెపి రాష్ట్ర నాయకులు వేణుగోపాల్ సూటి ప్రశ్నించారు. ఈ సందర్భంగా బుక్క వేణుగోపాల్ మాట్లాడుతూ...సామాన్య ప్రజలపై 3నెలలకు సరిపడే గ్యాస్ పై 50 రూపాయిలు అనగా నెలకు 17₹ పెరడగం వల్ల భారం పడినదా లేక కెసిఆర్ పెంచిన బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు, మద్యం, రిజిస్ట్రేషన్ల యొక్క వేల రూపాయిల వల్లనా??..రాష్ట్ర ప్రజలందరు కెసిఆర్ ఒక్క అవినీతి అసమర్థ పాలనను గురిస్తున్న తరుణంలో తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు చేపట్టిన గడిబిడి ధర్నా పూర్తిగా విఫలమై టిఆర్ఎస్ సర్కార్ చతికిల పడిందన్నారు. విదేశాల నుండి దిగుమతి చేసుకునే గ్యాస్ పై నెలకు 17 రూపాయిలు పెరిగిందని నెలకు 1700 రూపాయిల పై దోచుకునే వారి మాటలు ప్రజలు నమ్ముతారనుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కెసిఆర్ నిజంగా ప్రజా పక్షపాతి, దేశ్ కా నేత అయితే అన్ని పార్టీలను కూడబెట్టి గ్యాస్, పెట్రోల్, డీజీల్ లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని బుక్క వేణుగోపాల్ సవాల్ చేశారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: