ప్రజాఘోష విని భరోసా ఇచ్చేందుకు బిజెపి ముందుకు వచ్చింది

బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ 

(జానో జాగో వెబ్ న్యూస్-మహేశ్వరం ప్రతినిధి)

కెసిఆర్ ప్రజా వ్యతిరేక పాలనలో జనం గోస విని భరోసా ఇచ్చేందుకు బిజెపి ముందుకు వచ్చిందని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రజా గోస - బిజెపి భరోసా వనపర్తి నియోజకవర్గంలోని "పాతబజార్" శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కి పోలింగ్ బూత్ నెంబర్ 104 & 105 లలో శక్తి కేంద్ర ఇంచార్జి మండ్ల రాజు  ఆధ్వర్యంలో జరిగిన ప్రజా గోస-బిజెపి భరోసా కార్యక్రమానికి ముఖ్య అథితిగా బిజెపి రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్  హాజరయ్యారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేసీఆర్ అసమర్థ పాలన వల్ల ప్రజలు పడుతున్న గోసల్ని చూడలేక భరోసా కల్పించడానికి బిజెపి మీముందుకు వచ్చిందని వనపర్తి నియోజకవర్గ ప్రజలతో తెలియజేశారు. 
అలాగే బూత్ సభ్యులందరికి మరియు పార్టీ కార్యకర్తలతో "నరేంద్ర మోడీ గారు "అందిస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహనా కల్పిస్తూ ప్రతి ఇంటికి కమలం పువ్వు గుర్తును చేరువ అయ్యేలాగా కృషి చేయాలనీ బుక్క వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.నారాయణ, ఏ. రమీన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. కృష్ణ , నాగర్ కర్నూల్ పార్లిమెంట్ ఫుల్ టైమర్ బుడ్డన్న, రాష్ట్ర ఓబీసీ మోర్చ అధికార ప్రతినిధి బి. శ్రీశైలం, అసెంబ్లీ కన్వీనర్ పి. శ్రీనివాస్ గౌడ్, కో- కన్వీనర్ దాసరాజు ప్రవీణ్, వనపర్తి పట్టణ అధ్యక్షులు రామ్మోహన్ , బూత్ అధ్యక్షులు రాకేష్ నాయుడు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: