గూడ్స్ రైలు కిందపడి...
వ్యక్తి ఆత్మహత్య
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
నంద్యాల జిల్లా స్థానిక నంద్యాల రైల్వే స్టేషన్ నందు గూడ్స్ రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామానికి చెందిన గోరంట్ల రామ కోటయ్య కుమారుడు గోరంట్ల కృష్ణమూర్తి(58) సుమారు 12 సంవత్సరాలు క్రితం ఆర్మీలో పనిచేస్తూ పదవి విరమణ పొంది, ప్రస్తుతం తన కుటుంబం నుంచి దూరంగా ఉంటూ నంద్యాల పరిసర ప్రాంతాల యందు మరియు పుణ్యక్షేత్రాలలో ఒంటరిగా తిరుగుతూ ఉండేవారని,
కుటుంబ సభ్యులు ఎవరూ లేక ఒంటరిగా ఉండడం ఇష్టం లేక జీవితం పై వివరక్తి చెంది నంద్యాల రైల్వే స్టేషన్ నందు గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోని ఉంటాడని భావించి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.నంద్యాల రైల్వే ఎస్ఐ అబ్దుల్ జలీల్ గారు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
Post A Comment:
0 comments: