ధనార్జనే ధ్యేయంగా... వ్యవహరిస్తున్న మహానంది ఈవో
ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగ శేషు డిమాండ్
(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)
ధనార్జనే ద్యేయంగా వ్యవహరిస్తున్న మహానంది ఈవో చంద్రశేఖర్ రెడ్డి పై దేవదాయ శాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగ శేషు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లాలోని శైవ క్షేత్రాలలో అత్యంత ప్రధాన ప్రాధాన్యత కలిగిన మహానంది దేవస్థానంలో ఆదాయమే వృత్తిగా ఏర్పాటు చేసుకొని మహానంది దేవస్థానమునకు వచ్చే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అక్రమార్జనకు పాల్పడుతూ, దేవస్థానంలో పనిచేసే సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తూ, ఆలయ పరిసర ప్రాంతాల్లో వ్యాపారం చేసుకుంటున్న వ్యాపారస్తులపై అధిక రుసుము వసూలు చేస్తున్నారని, మహానంది పరిసర ప్రాంతాలలో బ్లీచింగ్,శానిటైజేషన్ చేయకుండా తాను చెప్పిందే వేదమన్నట్టుగా వ్యవహరిస్తూ తన పబ్బం గడుపుకుంటున్నారని,
మహానంది పుణ్యక్షేత్రానికి ఎంతో మంది భక్తులు మానసిక ప్రశాంతత కోసం, ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం సుదూర ప్రాంతాల నుండి ఎంతో ఉత్సాహంగా మహానంది పుణ్యక్షేత్ర దర్శనానికి వస్తే మహానంది లో అడుగు పెట్టినప్పటి నుండి భక్తులు నిలువు దోపిడికి గురవుతూ మానసిక ఆనందాన్ని, ఉత్సాహాన్ని కోల్పోతూ వెనుతిరిగిపోతున్నారని, మహానంది దేవస్థానంలో ఈవో రాజకీయం చేస్తూ అగ్రవర్ణాల వారికి ఉచిత దర్శనాలు బడుగు బలహీన వర్గాల వారికి డబ్బుతో కూడుకున్న దర్శనాలు ఏర్పాటు చేస్తున్న ఈవో చంద్రశేఖర్ రెడ్డి పై ఎండోమెంట్ అధికారులు చర్యలు తీసుకొని ఈవో చంద్రశేఖర్ రెడ్డి ని తిరిగి తన ఉపాధ్యాయ వృత్తికి పంపించి సమర్థవంతమైన, నీతి,నిజాయితీ కలిగిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ను మహానంది దేవస్థానానికి ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలను కాపాడాలని ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగ శేషు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ గౌడ్, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ఎన్ లక్ష్మణ్, శ్రీశైలం నియోజకవర్గం అధ్యక్షులు మధు,మాల మహానాడు నాయకుడు చెన్నయ్య,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
ధనార్జనే ధ్యేయంగా... వ్యవహరిస్తున్న మహానంది ఈవో ,,, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలి,,,, ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు నాగ శేషు డిమాండ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: