రెడ్ క్రాస్ సేవలు వెలకట్టలేనివి... 

వికలాంగుల పాఠశాలల నిర్వహకులు

(జానో జాగో వెబ్ న్యూస్-నంద్యాల జిల్లా ప్రతినిధి)

నంద్యాల జిల్లాలోనీ  వికలాంగ పాఠశాలలో మానసిక,చెవిటి,మూగ, వికలాంగుల పిల్లలకు దాదాపు 500 మందికి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల బ్రాంచ్ ఆధ్వర్యంలో 10-02-23 వ తేదీన కంటి వైద్య శిబిరాలను గోపవరంలోని సెయింట్ ఆన్స్ మానసిక వికలాంగుల పాఠశాలలో, అయ్యలూరి మెట్టలోని నవజీవన్ చెవిటి,మూగ పిల్లల పాఠశాలలో దాదాపు 300 మంది విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించామని,


11-02-23 వ తేదీన వెలుగోడు క్రాంతి వికలాంగుల పాఠశాలలో, పెద్దకోటాలలోని భారతి ఎడ్యుకేషనల్ (ఎంఆర్) పాఠశాలలో,ఆళ్లగడ్డ లోని గర్ల్స్ చైల్డ్ హోమ్ నందు , క్రాంతి నగర్ లోని బ్లైండ్ స్కూల్ నందు, చామకాలవలోని ఉషా మనో వికాస్ పాఠశాల నందు దాదాపు 200 మంది కి కంటి వైద్య పరీక్షలు నిర్వహించామని,

ఈ ఉచిత వైద్య శిబిరాలలో ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోఆర్డినేటర్స్ ప్రేమ్ సాగర్, దేవయ్య,ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులు యాకూబ్, ఉస్మాన్ భాష,నంద్యాల రెడ్ క్రాస్ సభ్యుడు బాలుడు,వెలుగోడు రెడ్ క్రాస్ నాయకులు మునురుద్దీన్,నాగశేషులు, ఆళ్లగడ్డ రెడ్ క్రాస్ నాయకులు వెంకటేశ్వర్లు, వీరేష్,విజయకాంత్, చేన్నయ్య మరియు పాఠశాలల నిర్వాహకులు, మాస్టర్ స్కూలు హాలిమా, ఉచిత కంటి వైద్య శిబిరాలలో పర్యవేక్షించి సేవలందించారనీ నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి తెలిపారు.ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి మాట్లాడుతూ మొదటి విడతగా10-02-23 వ తేదీ నుండి 11-02-23 వ తేదీ వరకు దాదాపు 500 మంది పిల్లలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు ఉండే కంటి సమస్యల గురించి తెలుసుకోన్నామని,


త్వరలోనే రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ మరియు ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సహకారంతో అవసరమైన వారికి కంటి అద్దాలు,మందులను విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని, విద్యార్థుల సమస్యల పూర్తి  నివేదికను నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్,కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సామాన్ గారికి అందజేసిన అనంతరం రెండో విడత కంటి వైద్య శిబిరాలను నంద్యాల జిల్లాలో ఉండే అన్ని అనాధాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో నిర్వహిస్తామనీ నంద్యాల జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పర్ల దస్తగిరి తెలిపారు.


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: